Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇందతడెంతో సమర్థతను ప్రదర్శించాడు. బ్యాండు వాయించేవారు, బాగ్ పైపర్లు, లాడ్జీలు, కార్మికుల సంఘాలు. వీళ్ళలో చాలామంది లినెన్ మిల్లులో పనిచేసే స్త్రీలు, బాలికలు ఉన్నారు. వీళ్ళందరితో గూడిన వుత్సవం మైలు పొడుగున నడిచింది. ఇందులో పాల్గొన్నవారు బ్రిటిష్ అమెరికన్ జెండాలను, బానర్లను పట్టుకొని "కార్నెగీకి స్వాగతము!" అని వ్రాసిన ఆర్చిల క్రిందుగా ఊరేగింపును నడిపించాడు. ఈ ఉత్సవం ఆండ్రూ జన్మించిన శిలాకుటి (Stone Cottage) దగ్గర, అతని తల్లి పెట్టిన స్వీట్ షాపు (మిఠాయి దుకాణం) దగ్గర రెండుచోట్ల ఆగింది. రెండోచోట ఆగినప్పుడు ఏర్పడ్డ నిశ్శబ్దంలో వినిపించిన అబ్బీ గంటల తీయనైన ధ్వనులకు, “ఉక్కురాజు కన్నులలో ఆనందబాష్పాలు పొంగిపొరలాయి.

తరువాత విందు జరిగింది. పరిచితాలైన పూర్వప్రదేశాలను, ఇతర ముఖ్యస్థలాలను తిరిగి చూశారు. శంకుస్థాపనోత్సవ సమయంలో ఏరిల్ ఆఫ్ రోస్బరీ ప్రసంగించాడు. ధర్మకర్తలందరూ వుత్సవపు తంతును కార్నెగీ తానే నిర్వహిస్తున్నాడని వుద్దేశపడ్డారు. కానీ, అతడు ఆ గౌరవాన్ని తన తల్లి కివ్వవలసిందని ప్రార్థించాడు. సంవత్సరం సంవత్సరం ఆమె మీద అతని గౌరవం వృద్ధి కావడమే యిందుకు కారణం. అతడు అప్పుడప్పుడు ఆమె నొసటిని వ్రేలితో తాకి 'టామ్క, నాకు మేధాశక్తి నిచ్చిన తావు యిక్కడ వుంది' అనేవాడు. అతడు తలచినట్లే సితకేశకిరీటంతో వినీలమైన సిల్కు వస్త్రాలలో విశిష్టమైన మూర్తిని వహించిన అతని తల్లి, అమలినమయిన ఆత్మశక్తిని, అత్యుదాత్తతను ప్రకటిస్తూ తంతు నంతటినీ పూర్తిచేసింది. సున్నాన్ని వెండి తాపీతో పరచి, ఎత్తిన రాతిమీద ముమ్మారు మూడు దెబ్బలు కొట్టి అక్కడ సమావేశమయిన వారందరికీ వినిపించేటట్లు స్పష్టమయిన కంఠంతో "స్మృతి చిహ్నమయిన ఈ శిల సశాస్త్రీయంగాను, సక్రమంగాను నిక్షిప్తమయినదని నేను ప్రకటిస్తున్నాను. పరమేశ్వరుడీ ప్రయత్నాన్ని ఆశీర్వదించుగాక!" అన్నది.

తానొక రచయితననే భావాన్ని ఎల్లప్పుడూ వహించే ఆమె పుత్రుడు “ఆన్ అమెరికన్ ఫోర్ - ఇన్ - హాండ్ యిన్ బ్రిటన్" అన్న గ్రంథంలో ఈ కోచ్ ప్రయాణాన్ని వర్ణించాడు. ఈ గ్రంథం 1882లో ప్రకటితమైంది.

ఆ 1881 సంవత్సరంలోనే పిట్స్బుర్లు పెట్టుబడి దారులు ప్రతిద్వంద్వంగా, హోమ్లేడ్లో ఎడ్గర్ థామ్సన్ వర్క్స్్క్స్క కొంచెం క్రిందుగా, మోనాంగహాలా నది ఆవలి ఒడ్డున మరొక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు. కానీ కొత్త సంస్థకు కార్మికసంబంధమైన ఇబ్బందుల వల్ల దెబ్బ తగిలింది. కొంత వెనక్కు తగ్గి వచ్చిన