Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పసిఫిక్ సంస్థకు సంబంధించిన ఋణపత్రాలమీద సంతకాలు చేస్తే అతడు దాని వినాశం లోపలికి ఆకర్షింపబడినవాడౌతాడు. అందువల్ల పిట్స్ బర్గులోని అతని సంస్థలన్నింటికీ ప్రమాదస్థితి కొని తెచ్చుకున్నవాడవుతాడు అని ఊహించి, కార్నెగీ కంపెనీలకు ఆర్థికనిలయమైన ఏక్స్చేంజి బ్యాంకి ఎంతగానో ఆందోళన పడ్డది. ఈ బ్యాంక్ కార్నెగీ కంపెనీలకు సంబంధించిన పత్రాలను పెద్ద మొత్తాలను తన దగ్గర కుదువబెట్టుకున్నది. అందుచేత ఆ బ్యాంక్ డైరెక్టర్లు వెంటనే కనిపించవలసిందని కార్నెగీని పిలిపించారు. తగ్గ సమాధానం చెప్పుకోవటం కోసం అతడు వెంటనే న్యూ యార్క్ నుండి బయలుదేరాడు.

గంభీరమైన ముఖకవళికలతో కూర్చున్న ఆ డైరెక్టర్ల ముందు హాజరై కార్నెగీ అతి ప్రశాంతంగా ఇలా అన్నాడు.

“టెక్సాస్ ఆండీ పసిఫిక్ కంపెనీలోని రెండు వందల యాభైవేల డాలర్ల వాటాలకు నేను యజమానినైన మాట సత్యం. దీనినంతటినీ నేను సొంత ధనమిచ్చి కొన్నాను. ఎక్కడా నేను వారి పత్రాలమీద సంతకాలు పెట్టలేదు.”

వారు దీన్ని నమ్మలేకపోయినారు.

“ఒక డాలరు విలువచేసే వారి సాహసిక వ్యాపార పత్రంమీద కూడా నా సంతకం లే”దని గట్టిగా నొక్కి చెప్పి, కార్నెగీ వాళ్ళతో ఇంకా ఇలా అన్నాడు. “వ్యాపార ప్రపంచానికి సాహసిక వ్యాపారం (Speculation) వంటి ఘనమైన అభిశాపం మరొకటి లేదని నా అభిప్రాయం. స్కాట్ ఎక్స్చేంజి ద్యూత గృహం కంటే ఇంచుక మంచిది లేదా దానితో తుల్యమైంది" ఈ అభిప్రాయమే అతనికి జీవితాంతము వరకూ నిశ్చలంగా వుంది. "మా సంస్థల సాధనసంపత్తిని వృద్ధి పొందించుకోటం కోసం. మీరిచ్చిన అప్పులకు తప్ప, నేను ఈ కంపెనీతో సహబాధ్యత వహించిన ఋణపత్రాలు ఏమీ లేవు. నా సంస్థలనుంచి నాకు తిరిగి వచ్చే ప్రతి డాలరును, మీ బాకీలను తీర్చటానికి నా ఆస్తులు చాలునని చూపించడానికి హామీ ఇవ్వటానికి నేను సంసిద్ధుడనై వున్నాను.”

"కార్నెగీ! ఆ ఋణాలను గురించి మాకు అణుమాత్రమయినా ఆందోళన లేదు” అని బ్యాంకి అధ్యక్షుడు బయటపడ్డాడు. "ఇదంతా టెక్సాస్ అండ్ పసిఫిక్ కంపెనీ గురించి, వాళ్ళ ఋణపత్రాలమీద నీవు అనుమతి సంతకాలు చేస్తున్నావని మేము విన్నాము” అన్నాడు.