Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెయ్యకపోయినా, తరువాతి కాలంలో చెప్పినదంతా కార్యరూపాన చేసి చూపించే సమయం వచ్చింది.

చదువుకోసం అతడు ఆక్స్ఫర్డ్ వెళ్ళలేదు. ఉపన్యాసాలివ్వటంలో, చరిత్ర, తత్త్వశాస్త్రం, సాహిత్యం, కళలు అన్న అంశాలలో తన జ్ఞానాన్ని పెంపొందించు కోవటానికి ఎంతో కృషి చేశాడు. వ్యాపారంతో బాటు, ఆత్మసంస్కృతిని అభివృద్ధి చేసుకోవటం కూడా ఒక ఉద్దేశంగా పెట్టుకొని, అతడు ఇంగ్లండుకు, తదితరదేశాలకు ఎన్నో మారులు యాత్ర చేశాడు. అతడ్ని రెండూ ఆకర్షించడం ప్రారంభించాయి. అంతరాత్మలో ఉన్నత విషయాలమీద ప్రగాఢమైన ప్రేమ వున్నప్పటికీ, అతడు వ్యాపారంలో కలుగుతున్న విజయ వ్యామోహాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు. వ్యాపారానికి స్వస్తి చెప్పటం కోసం కేటాయించుకున్న రెండు సంవత్సరాల్లో అతడు హృదయపూర్వకమైన తీవ్రకృషి చేశాడు. అతడు, బాల్టిమోర్ ఓహైయో రైల్ రోడ్ పెట్టుబడిదారు, జాన్ డబ్ల్యు. గారెట్ దగ్గరికి వెళ్ళి హీలింగ్, పార్కర్స్బర్గు అన్న రెండు ప్రదేశాలల్లో ఓహైయో నదిమీద కట్టవలసిన రెండు బ్రిడ్జీలకు సంబంధించిన కాంట్రాక్టులను అతడికి అమ్మివేశాడు. చికాగోలో స్లీపింగ్ కార్లను ఉత్పత్తి చేస్తున్న జార్జి యం. పుల్మన న్ను కలుసుకొన్నాడు. మనుష్యస్వభావ పరిశీలన విషయంలో కించిత్తయినా రోషం లేని తన సహజావబోధశక్తితో అతనికున్న వ్యాపారికమహత్తును గుర్తించాడు. కార్నెగీ సహచరులు అతనితో "మనం పుల్మన్ మీద స్వత్వోల్లంఘనం (Infringement) చేసినందుకు అభియోగం తీసుకురావా లని తీవ్రధోరణిలో మాట్లాడారు.

“నా అభిప్రాయం అది కాదు. అభియోగాలు న్యాయస్థానం చుట్టూ ఎలా త్రిప్పుతాయో మీకు తెలుసు. డబ్బంతా న్యాయవాదుల పాలు కావటమే జరుగుతుంది. పుల్మన్కు చికాగో కార్యస్థానం కావటం వల్ల అతనికి మధ్య పశ్చిమ, దూర పశ్చిమ రైలు మార్గాలతో మనకంటే ఎక్కువ సాన్నిహిత్యమున్నది. అందువల్ల అతడికి మంచి అవకాశం, అంతే కాక ఆ యువకుడు పరిశ్రమ రంగంలో ఘనకార్యాలు నెన్నింటినో నిర్వర్తింపనున్న అదృష్టశాలి. చేతనయినంత మనం అతనితో చేతులు కలుపుదాం” అని, కార్నెగీ వారి అభిప్రాయంతో వ్యతిరేకించాడు.

సెయింట్ నికొలస్ హోటల్ మెట్లముందు 1869లో ఒక వేసంగి సాయంకాలం కార్నె, జార్జి పుల్మన్ దరిదాపుగా ప్రక్కప్రక్కన నడుస్తున్నప్పుడు అదృష్టదేవత చిరునవ్వు