Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధపు చివరిదశలో అతని రైల్ రోడ్ వుద్యోగం పై అధికారులయిన థామ్సన్, స్కాట్ల అభిలాషకు భిన్నంగా అంతమొందింది. ఆండ్రూ మార్చి 28, 1865లో రాజీనామా లేఖను అందజేశాడు. ఎవరి మధ్య పనిచేసి తానెవరి అనురాగాన్ని అనుభవించాడో, ఆ పిట్స్బర్గు డివిజనులోని వ్యక్తులను ప్రశంసిస్తూ ఒక వీడ్కోలు లేఖ వ్రాశాడు. వారు వీడ్కోలు వేళ అనురాగపూర్వకంగా ఒక అందమైన గడియారాన్ని బహూకరించారు. మరొక అలిఘనీ పూర్వబాలురలలో వాడు బాబ్ పిల్కైరన్, అతని తరువాత ఆ స్థానానికి అధిపతిగా వచ్చాడు. ఏవో డజను ఇతరమైన పనులు తాము అలవోకగా చేసినట్లే, కార్నెగీ మిల్లర్లు ఇద్దరూ కొద్ది యెత్తున పిట్స్బర్గులో లోకోమోటివ్ వర్క్న స్థాపించారు. అది వీలునుబట్టి మధ్య మధ్య ఒక ఇంజినును తయారు చేస్తున్నది. ఇంతకు పూర్వసంవత్సరం కార్నెగీ, అతని ఇరుగు పొరుగైన విలియం కోలిమన్ సరిహద్దు దాటి, ఓహైయోలో ప్రవేశించి మరికొంత పెట్రోలియం నూనెభూమిని కొన్నారు. ఇది చాలా ఫలప్రదమైనది. దీనిమూలంగా క్రొత్త పెట్టుబడులకు ఎంతో ధనం చేకూరింది. తొలిసారిగా, రెండు మహాసముద్రాలను రైలు మార్గాల ద్వారా కలిపి వేయటానికి, పచ్చిక మైదానం, పర్వతశ్రేణిగుండా మార్గాన్ని వేస్తున్న పసిఫిక్ యూనియన్ రైల్ రోడ్ కంపెనీలో స్టాకు కొన్నది. ఇందువల్ల లభ్యమైన ధనం వల్లనే 1867 ఆరంభంలో సెయింట్ లూయీ వద్ద మిసిసిపీ నదిమీద మూడు ఆర్చీలు గల సుప్రసిద్ధమైన వంతెన పనిని కీస్టోన్ బ్రిడ్జి కంపెనీ ఆరంభం చేసింది. దానికి నమూనాను తయారు చేసింది. కెప్టెన్ బి. జేమ్స్ ఈడ్స్. అయినా కీస్టోన్ కంపెనీవారి మిస్టర్ లిన్విల్లీ కొన్ని మార్పులు చేశాడు. తరువాతి శతాబ్దంలో మూడుపాళ్ళు గడిచిన తరువాత కూడా, ఆ ఇనుపబ్రిడ్జి విస్తారంగా పెరిగిపోయిన రైలు బండ్ల రాకపోకల బరువును, ఆ మార్గానికి సంబంధించిన రాకపోకల భారాన్ని భరిస్తున్నది.

ఈ సమయంలో, రచయిత బేయర్డ్ టైలర్ యూరప్ లో కాలినడకన చేసిన ప్రయాణాలను అభివర్ణించే “వ్యూస్ ఎఫూట్" అన్న పుస్తకం హోముడ్లో ఎక్కువ ప్రీతిపాత్రమయిన గ్రంథంగా ఉంటుండేది. కార్నెగీ తీవ్రంగా దేశాటనం చేసినవాడు. ఎన్నో దృశ్యాలను దర్శించినవాడు. చరిత్ర, భూగోళవిజ్ఞానాలంటే ఆసక్తి గలవాడు. టైలర్ వంటి అనుభవాలు తనకు కూడా లభించాలని కుతూహలపడ్డాడు. ఒక రోజున జూన్ వావ్ డివోర్టుతో "ఇప్పటి నుంచి నీవు మూడువందల డాలర్లను కూడబెట్టుకొని నాతో పాటు యూరప్ పాదయాత్ర చేయటానికి ఖర్చు చేస్తావా?" అన్నాడు ఆండీ. బాతు ఈదుతుందా? షావ్వాడు వుర్లగడ్డలు తింటాడా?