“లేదు” అన్నాడు ఆండ్రూ సమాధానంగా. “ఎందుకో మరి, మేకులతో నేలకు అంట పాతటం మాత్రమే జరిగింది. తోరణంలా వ్రేలాడుతున్నా అది పని చేస్తుంది. అయితే ఇలా నేలకు బిగిస్తే పని చెయ్యదు”.
పెట్టెలోనుంచి అతడు వేగంగా క్రిందికి దిగి, మేకు దగ్గరకు వెళ్ళి, రెండు చేతులతో బలం కొద్ది మేకును నేలనుంచి బయటికి లాగాడు. బిగించిన వైరును హఠాత్తుగా విడిపించటం వల్ల ఏం జరుగుతుందో అతడప్పు డూహించలేదు. అతని మొగాన గట్టి దెబ్బకొట్టి పైకి ఎగిసిపడ్డది. అతడి చెక్కిలి మీద అడ్డంగా లోతున గీచుకుపోవటం వల్ల నెత్తురు విపరీతంగా కారింది. నెత్తురుతో నిండిపోయిన చేతిగుడ్డను మొగాన అడ్డుపెట్టుకొని సైన్యంతో అతడు వాషింగ్టన్ ప్రవేశించాడు. అంతర్యుద్ధంలో యూనియన్ కోసం తొలిసారిగా నెత్తురును ఒలికించినవాణ్ణి నేనని, అతడు తరువాతి కాలంలో నవ్వుతూ అంటుండేవాడు.
వాషింగ్టన్ చేరగానే యుద్ధశాఖలో తంత్రివార్తాహరులు తక్కువగా ఉన్నట్లు తెలుసుకొన్నాడు. యుద్ధసేవకోసం మరి నలుగురికి ఉత్తరువులు పంపించి పిలిపించవలసిందని, అధికారులు అతన్ని కోరారు. అతడు ఆ ఉత్తరువును డేవిడ్ మెక్కార్లోకు తంతిమూలంగా పంపించాడు. అతడు ప్రస్తుతం పెన్సిల్వేనియా రైల్రోడ్కు టెలిగ్రాఫ్ సూపరింటెండెంటుగా పనిచేస్తున్నాడు. మొక్కార్లో ఆ నలుగురు ఆపరేటర్ల పేర్లను, వారు వాషింగటన్ చేరటానికి వెంటనే ఏ మార్గాన వస్తుందో ఒక గంటలోపల తెలియజేశాడు. వారి వయస్సు పద్దెనిమిది, ఇరవై మూడు మధ్య వుంటుంది. వాళ్ళలో పెద్దవాడు స్ట్రేస్, తరువాత ప్రభుత్వం తంతి సమాచారశాఖకు సూపరింటెండెంటు అయినాడు.
పోటోమాక్ నది మీదుగా వర్జీనియా రాష్ట్రంలోకి వెళ్లే బాగా దెబ్బతినిపోయిన మార్గాన్ని పునర్మించటం అతనికి తరువాతి కర్తవ్యమైంది. ముఖ్యపట్టణరక్షణార్థం ఆ ప్రాంతానికి ఫెడరల్ సైన్యం వెళ్లేటందుకు వీలు కలిగించాలంటే, ఇది ఎంతైనా అవసరం. ఉన్నతోద్యోగితో సహా అందరూ గడియారం దగ్గర పెట్టుకొని పనిచేసి పోటా మాక్ నది మీది పొడుగాటి పాత వంతెనను తిరిగి కొయ్యతోటే నిర్మించడం జరిగింది. చెడగొట్టబడ్డ మొత్తం మార్గాలను, వంతెనలను, తంతి తీగలను సరిచేయిస్తూ, క్రొత్తవి నిర్మిస్తూ ఆ యువకుడయిన ఉన్నతోద్యోగి, ఆరువారాలు గడిపాడు. 1861 వేసగిలో ఎన్నడూ ఎరగని ఎండలు కాశాయి. అమెరికాలోని నిదామతాపానికి అతడు