Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని అతడు అంతవరకూ భావించాడు. ఇరుపక్షాల మధ్య ఏర్పడ్డ విచ్ఛిత్తి ఎంత తీవ్రమయిందో అర్థం చేసుకోలేకపోయిన అతనివంటి వ్యక్తులు మొదట్లో చాలామంది ఉండేవారు.

యుద్ధసేవ చేయవలసిన అవసరం పెన్సిల్వేనియా రైల్ రోడ్ కంపెనీలో పనిచేసేవారికి అతివేగంగా వచ్చింది, మిస్టర్ స్కాట్న ట్రాన్స్పోర్టేషన్ను శాఖకు యుద్ధసహకార్యదర్శిని చేశారు. అతడు వెంటనే తనకు విశ్వాసపాత్రుడయిన ఆండ్రూ కార్నెగీని రైల్వే మనుష్యులతో ఒక సైనికదళాన్ని కూర్చుకొని మిలిటరీ రైల్డ్, టెలిగ్రాఫ్ల పని చూచేటందుకు సహాయకునిగా రమ్మని పిలిపించాడు. మసాచ్యుసెట్స్నుంచి దక్షిణానికి చేరవలసిన సైన్యం బాల్టిమోర్ మీదుగా వెళ్లుతున్నప్పుడు ఒక మూక ఎదుర్కొన్నది. ఎన్నోచోట్ల రైల్వే లైనులను తెగగొట్టి, వంతెలను తగలేసి అది మార్గాలన్నింటినీ పాడుచేసింది. ఏప్రిల్ 19 తరువాత ఒక వారానికి వాషింగ్టను, ఉత్తరానికీ మధ్య వార్తాప్రసారం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. ఇది చాలా విషమమైన పరిస్థితి.

ఆ మార్గాన్ని తిరిగి సరిచేయించటం కార్నెగీకి నిర్ణీతమైన ప్రథమకర్తవ్యం. ప్రయాణం చేయవలసిన సైన్యంలో నుంచి ఎన్నుకొన్న మనుష్యులను, ఒక ఇంజినీరింగ్ దళాన్ని అతడు కనికరమన్నది ఎరగకుండా తరిమి పనిచేయించాడు.

వారాంతరంలో బండ్లు తిరిగి నెమ్మదిగా దక్షిణానికి వెళ్ళటం ప్రారంభించాయి. కట్టలను మధ్యమధ్య దట్టించటానికి, ఎంతో ఘనమయిన భారాలను మోయగలందుకు, వాటిని బలయుతం చెయ్యటానికి తన మనుష్యులను అక్కడ ఆపుదల చేసి, నిండా సైనికులున్న రైలు బండి ఇంజిన్ పెట్టెలో కూర్చుని, తాను బాగుచేయించిన రోడ్డు మీదుగా వాషింగ్టన్ వైపునకు ప్రయాణం చేశాడు. బండిమీద విద్రోహచర్య ఏదైనా జరుగుతుందేమో అన్న భయంతో వాళ్ళు అతి జాగరూకులై వెడుతున్నారు. వాషింగ్టన్ ఇంకా చాలా మైళ్ళ దూరాన ఉంది. ఉన్న ఒక్క తంతితీగనూ స్తంభాలనుంచి వదులు చేసి, నేలమీద మేకుతో గట్టిగా అంటబాతినట్లు ఆండ్రూ గమనించాడు.

"ఇక్కడ ఆపండి. నేను తంతితీగను విడుదల చేయాలి" అన్నాడు ఆండ్రూ ఇంజినీరుతో.

“దాన్ని తెగనరికారా ఏమిటి?" అప్పటికి ఇంకా గాలి బ్రేక్ రాలేదు కనుక ఆవిరిని ఆపి వెనక్కు నడుపుతూ ప్రశ్నించాడు ఇంజినీరు.