లేవు. అవి అన్నీ వున్నతస్థాయిలోనే. మీరు కావాలంటే వచ్చి చూచేటంతవరకూ అట్టిపెట్టమని ఆ ఆస్తిగలవాళ్ళతో చెప్పి ఉంచుతాను.”
ఆండ్రూ, తల్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించటానికి వెళ్ళారు. దాన్ని చూడటంతోనే వారికి ఎంతో ఉల్లాసం కలిగింది. అది మంచి విశాలమయిన మైదానాలు, చెట్ల గుంపులు, పొదలు, కోనలు - వీటిమధ్య ఉన్న రెండంతస్తుల కాటేజి, నగరంలోని కార్నెగీల ఇల్లు చిన్నజాతిలోది. అయినా కుటుంబానికి చాలినంతగా స్థలముంది. మార్గరెట్ మిత్రబృందాన్ని పెంపొందించుకొని, అల్తూనాలో కంటే అధికవిస్తృతిగల పుష్పోద్యానాన్ని పెంచుకొని, తన జీవితంలోని ఆనందకరమైన అనేకసంవత్సరాలను ఇందులో గడిపింది.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రాత్రి ఏ గంటలోనైనా, ఆదివారమైనా యువకుడైన ఆ ఉన్నతోద్యోగి పిలుపును అందుకొనేటందుకు వీలుగా ఇంటిలోకి టెలిగ్రాఫు తీగ అమర్చబడింది.
ఇరుగుపొరుగువారైన స్టువార్డులు కూడా నెమ్మదిగా వారికి ప్రీతిపాత్రులైనారు. ఆండ్రూ ఇక్కడ యువకుడైన ఇరుగుపొరుగు జాన్వాని వోర్డును కలుసుకున్నాడు. ఇతడిలాగనే మిస్టర్ స్టీవర్డ్ కాలం గడిచిన తరువాత కార్నెగీ యినుము - వ్యాపారంలో భాగస్థుడైనాడు. ప్రియమైన "వాన్డీ" ఆండ్రూ చివర చివరగా చేసిన కొన్ని విదేశ ప్రయాణ కాలాల్లో అతనికి సహచరుడిగా వుండేవాడు. కార్నెగీలు హోముడ్కు వలస వచ్చిన తరువాత అక్కడికి ఇంకో వాసితుణ్ణి తీసుకువచ్చారు. అతడు థామస్ ఎన్, మిల్లర్ - ఇతడు పరీక్ష కాగిన నిజమైన మిత్రుడు. సంగీతం, గ్రంథాలు, దేశయాత్ర అన్న విషయాలో ఆండ్రూతో అన్యోన్యత గలవాడు. ఆండ్రూ కార్నెగీలో ఉన్న మనోహరమైన లక్షణాలల్లో ఒకటి, మైత్రి నార్జించటంలో గల సామర్థ్యం. మిత్రుల యెడ అతనికుండే ఆసక్తి అతితీవ్రమైంది. నిత్యమైంది. మిత్రులను అతడెన్నడూ మరిచిపోయేవాడు కాదు. వృద్ధాప్యం వృద్ధి పొందుతున్న సంవత్సరాలలో అతనికి అత్యానందప్రదాలైన దినాలు, బహుకాల వియోగానంతరం యౌవనం నాటి మిత్రులను కలుసుకొన్న రోజులే!
హోమ్వడ్ లోని విజ్ఞావంతులు. సాంస్కృతికులతో గూడిన సమాజం హృదయపూర్వకంగా ఆండ్రూని తమలో ఒక సభ్యుణ్ణి చేసుకొన్నవి. ఆ ప్రాంతంలో కల్లా పెద్ద న్యాయమూర్తి విలియం జోన్సు. మంచి విద్వాంసుడు. ఉద్యోగవిరమణ కాలంలో విశ్రాంతి తీసుకొంటున్నాడు. కొన్నాళ్ళు సెనటర్గా వ్యవహరించాడు.