మిస్టర్ స్కాట్ అతని సాధుత్వాన్ని గమనించి వస్తున్న నవ్వును ఆపుకొన్నాడు. "ఆ వుద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందలు వస్తున్నాయి. మిస్టర్ పాట్కు పద్దెనిమిది వందలు వస్తున్నాయి. నిన్ను పదిహేను వందల మీద నియమించటం ఉచితం. నీవీ తొలి పరీక్షలో విజయవంతుడవయితే జీతం పద్దెనిమిది వందల దాకా పెరుగుతుంది. అది నీకు సంతృప్తికరమేనా?”
ఒక్కమాట తలనూచి చేతిని ఆడించటంతో, అది అతనికి అప్రధానవిషయ మని ఆ క్రొత్త వున్నతోద్యోగి తెలియజేశాడు.
తనకబ్బిన శుభాన్ని గురించి తెలియజేసే ఆతురతతో అతడు మరోమారు వేగంగా ఇంటికి చేరాడు. అసలతడు పరుగెత్తి వెళ్ళదలచాడు. కానీ అది, పెన్సిల్వేనియా రైల్ రోడ్ వారి పిట్స్బర్డు డివిజన్ సూపరింటెండెంటు గౌరవానికి భంగకరమైన పనైపోయింది. అతని తల్లి ఈ వార్త విని సంక్షేపంగా సంతోషించింది. ఆండ్రూవంటి కుర్రవాడివల్ల ఆశించేది ఇటువంటివి కావటమే ఇందుకు కారణం. ఆమె తిరిగి పిట్స్బర్గుకు వెళ్ళటమనే సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె "పూర్వమిత్రులు మధ్యకు, బంధువుల మధ్యకు వెళ్ళటమంటే సంతోషకరమైన విషయమే గాని అక్కడి పొగమసికి భయమేస్తున్న" దన్నది.
పదహారేళ్ళ వయసుగల టామ్తో అన్నాడు: “నాకు కార్యదర్శివిగా వుండటం నీకిష్టమేనా?”
“ఎంతో బాగుం” దాని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు టామ్. అతడు ఇప్పుడు అద్భుతమైన టెలిగ్రాఫరు అయినాడు. డివిషన్ సూపరింటెండెంటుకు తంతిద్వారా అనేకమైన వార్తలను పంపించటం, అందుకోవటం వుంటుంది.
సూపరింటెండెంటు బల్లమీద కూర్చుని ఉత్తరువు లిచ్చేటప్పుడు ఆండ్రూ 'అబ్బా!’ అని అనిపించుకోకుండా వుండటానికి యత్నించాడు. ఉన్నతస్థాయి వుద్యోగానికి అమాంతంగా ప్రాకి పైకొచ్చిన చిన్నవాడయిన తన్ను గురించి, వయోవృద్ధులైన ఇతరోద్యోగస్థులు తమలో తాము గుసగుసలాడుకుంటారని అతడు అనుమానించాడు. అందువల్ల తన చిన్నరూపం సంగతి ఎలా వున్నా, తాను పొందిన ఆ వుద్యోగస్థానానికి తగ్గవాడనని నిరూపించటం కోసం అతడు మరింత నిశ్చయం చేసుకోవటం జరిగింది. తన గుణవిశేషాలను నిరూపించుకోవటానికి అతనికి ఆ సంవత్సరపు చలికాలంలో చాలా అవకాశాలు లభించాయి. ప్రమాదం సంభవించినప్పుడు డివిజన్