Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తీవ్రోద్వేగంతో ఆశించాడు. మరొకరి క్రింద పని చేయటమన్న భావం కలిగినప్పుడు అమితంగా భయపడ్డాడు.

మేనేజరు ప్రయాణం చేసి తిరిగి వచ్చాడు. అండీని తన కార్యాలయానికి రమ్మని పిలిచాడు.

“ఆ నిర్ణయం జరిగింది" అన్నాడు అతడు. "ఉపాధ్యక్షుణ్ణి కనుక నన్ను ఫిలడల్ఫియాకు మారుస్తారు.” “నా తరువాత వచ్చే జనరల్ మేనేజరు మిస్టర్ లూయీ.”

అతడు మాట్లాడుతున్నంతసేపూ ఆండ్రూ నరాలు బిగుసుకుపోతున్నవి.

“ఇక నీ విషయం పిట్సుబర్లు డివిజనుకు సూపరింటెండెంటు అయిన మిస్టర్ పాట్స్ను, ఫిలడెల్ఫియాలోని ట్రాన్స్పోర్టేషను శాఖకు ప్రమోటు చేస్తున్నారు. ఆ స్థానాన్ని నీకివ్వవలసిందని నేను ప్రెసిడెంటుకు రికమెండు చేశాను. పశ్చిమశాఖను నీవు నడపగలవా?" అన్నాడు చిట్టచివరికు అతని పై అధికారి.

ఆండ్రూకి క్షణకాలం తల తిరిగిపోయింది. విజయం, అభివృద్ధి అన్న రెండూ, దరిదాపుగా నిశ్చతమన్నంత వరకూ ఆత్మవిశ్వాసాన్ని కల్పించాయతనికి. అతనికి ఇరవై నాలుగో జన్మదినం ఇంకా కొద్దిరోజులకు గాని రాదు. తాను కేవలం రాజకీయజ్ఞుడు, అనుభవరహితుడు అయినప్పటికీ, తీసుకోమంటే మర్నాడే చానల్ ఫ్లీట్మీద ఆధిపత్యాన్ని పుచ్చుకొంటాడని, లార్డు జాన్ రస్సెలు గురించి చెప్పుకొనే విషయాన్ని స్మృతికి తెచ్చుకున్నాడు. బ్రూస్ గాని వాలెన్లు గాని ఇలాగే ప్రవర్తించేవాళ్ళు...

“నడపగలను" అని, "నడపగలనని బాగా ఎరుగుదు" నన్న అభిప్రాయాన్ని నిగూఢంగా అనుసంధించి సమాధానం చెప్పాడు.

“సరే మంచిది. నీకొక అవకాశమిచ్చి చూడటానికి ఫుస్టర్ థామ్సన్ అంగీకరించాడు" జీత మెంత కావాలని నీ అభిప్రాయం?"

“జీతమా?” అని ఆశ్చర్యపడ్డట్లున్నాడు - ఆ క్రొత్త సూపరింటెండెంటు. జీతం సంగతి అతని మనసులో ప్రవేశించనే లేదు. “నా ఆసక్తి జీతాన్ని గురించి కా” దన్నాడు. ఉదారంగా. "నేను కోరేది ఆ పదవి. మీరు వుండి పూర్వం పనిచేసిన ఆ స్థానాన్ని పొందటమే నాకు గొప్ప. అది చాలు, జీతాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయించండి. మీ కిష్టమయితే ఇప్పుడిస్తున్నదే ఇవ్వండి.”

(అది నెలకు అరవై అయిదు డాలర్లు)