Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్థానికుడైన వడ్డీ వ్యాపారస్థుడి దగ్గరికి వెళ్ళాడు. పెట్టుబడి పెట్టే నిమిత్తంగా డబ్బును అప్పుగా ఇవ్వటానికి అతనికి అవకాశం ఉంటుందేమో అని అడిగాడు. అతడు చాలా పొడగరి. ఆరు అడుగుల మనిషి. సాయిలా పాయిలావాడు. ఆండ్రూని యెరుగును. అతడంటే ప్రీతి కూడాను.

"అది మంచి పెట్టుబడి అని నీకు నిశ్చయంగా తెలుసునా?” బరువైన తన హస్తాన్ని ఆ యువ మిత్రుని భుజాలమీద అడ్డంగా ఉంచి ఆ వడ్డీ వ్యాపారి ప్రశ్నించాడు.

"తెలుసును. అది స్లీపింగ్ కార్ కంపెనీకి పెట్టుబడి. మా రైల్ రోడ్ సంస్థ రాయల్టీ పద్ధతిమీద అటువంటి కార్లను రెంటిని నిర్మించబోతున్నది.”

"తప్పక నీకిస్తాను, అండీ!" అన్నాడు మిస్టర్ లాయిడ్. "సాహసించి ఐనా ఇవ్వదగ్గవాడివి నీవు.”

ఆండ్రూ తన జీవితంలో ఒక ప్రామిసరీ నోటు వ్రాసి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ సంఘటనే తన అదృష్టానికి ఆరంభమని తరువాత కాలంలో అతడు నిత్యం భావిస్తుండేవాడు. దఫాలవారీగా అతడు చెల్లించవలసిన పెట్టుబడి మొత్తాలను, అతడికి వచ్చే డివిడెండ్ల మూలంగా వచ్చే డబ్బుతో చెల్లించగలుగుతుండేవాడు. పెన్సిల్వేనియా సంస్థ ఇంకా ఇతర జాతి స్లీపర్లను నిర్మిస్తున్నది. ఈ పనికి ఇతర కంపెనీలు, తామూ పూనుకొన్నవి. అతడికి ఇరవయ్యయిదేళ్ళ వయసు వచ్చేటప్పటికి స్లీపింగ్ కార్ల పెట్టుబడిమీద వస్తున్న సంవత్సరాదాయం 5000 డాలర్లు. "సాంకోపాంజా పలికిన ధోరణిలో అంటున్నాను, నిద్రను కనిపెట్టిన వాడెవడో గాని అతడికి శ్రేయమగుగాక!” అన్నాడు అతడో మాటు.

కార్నెగీలు అల్తూనాలో మూడేళ్ళున్న తరువాత, 1859 నాటి గ్రీష్మంలో, మిస్టర్ స్కాట్ తన అసిస్టెంటుతో అన్నాడు: "ఆండ్రూ! వాళ్ళు నన్ను ఫిలడెల్ఫియా సంస్థకు ఉపాధ్యక్షుణ్ణి చేయదలచుకొన్నారు. ఈ విషయాన్ని మిస్టర్ థామస్తోతో చర్చించేటందుకు నేను వచ్చేవారంలో ఫిలడెల్ఫియాకు వెళ్ళుతున్నాను.” ఈ వార్త విని ఆండ్రూ క్రుంగిపోయాడు. ఫిలడెల్ఫియా, అతడు విశేషంగా గౌరవిస్తూ, దరిదాపు అతని కాదర్శమూర్తి అని భావించే పెద్దను ఆకర్షించి వేస్తున్నది. దీని ఫలితం అతని మీద ఎలా వుంటుంది? స్కాట్కు అనుబంధంగా వుండటం తప్ప, ఇంతవరకూ అతనికొక విశిష్టత అంటూ ఏమీ లేదు. తన అధికారి తనకోసం ఫిలడెల్ఫియాలోనే ఏదయినా ఉద్యోగ మిప్పిస్తాడా? అలాగే జరుగుతుందని అతడు