Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తీసుకు వెళ్ళాడు. అల్తూనాలో సుఖమైన ఒక కాటేజిని అద్దెకు తీసుకోగల పరిస్థితి ఏర్పడగానే, మిసెస్ కార్నెగీ చెప్పులు కుట్టటాన్ని మళ్ళీ మానివేసింది. ఆండ్రూ ఆమెకు ఒక పరిచారిక అవసరమని నిర్ణయించాడు.

“నీవు జీవితమంతా చాలా శ్రమపడ్డావు. ఇప్పుడు సుఖపడటం కొత్తగా ప్రారంభించాలి” అన్నాడు ఆండ్రూ, తల్లితో.

ఇందువల్ల అతడు ఊహించనంతటి పెద్ద ధ్వని వినిపించింది. ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అన్నది :

“ఏమిటి? నా యింట్లో మరొక క్రొత్తమనిషి ప్రవేశించి అన్ని వ్యవహారాలల్లో స్వేచ్ఛగా సంచరించటమా? అందుకు నేను అంగీకరించను. ఇన్నాళ్ళుగా నా పిల్లలకోసం నేనే ఇల్లు దిద్దుకున్నాను. మీ కోసం వంట చేశాను. మీ దుస్తులను ఉతికి బాగుచేశాను. నీవు ఇప్పుడు నన్ను చేతులు ముడుచుకొని కూర్చోమంటున్నావు. నీవు నన్ను షెల్స్లో పెట్టదలిచావు. మరొక స్త్రీని నేను సహించలేను. బాలురైన మీకు ఇష్టమైన ఆహారపదార్థాలను ఎలా వండాలో ఇతరస్త్రీ ఎవతెకూ తెలియదు!"

ప్రక్కవాటుగా వచ్చిన మాటను పుచ్చుకొని అండీ "అమ్మా! నీవు నాకు, టాస్క సమస్తం చేశావు. నీవే సమస్తమైనావు. మరి, మమ్మల్ని నీ కోసం కొంత చెయ్యనీ. మనం భాగస్వాములమై ఒకరి కొకరం ఎవరికేది మంచిదో అది చేద్దాం. నీవు విందుల్లో యజమానురాలినై వ్యవహరించవలసిన సమయం వచ్చింది. కొద్ది దినాలలో నీవు బండిలో సంచరించబోతున్నావు. ఈ మధ్యకాలంలో నీకు సహాయం చేస్తుంది. ఆ పిల్లని యింట్లోకి రానీ. ఇలా చెయ్యటం టామ్క, నాకూ ఎంతో ఇష్టం!"

చాలాసేపు గొణిగినా చివరకు ఒప్పుకున్నది. సేవకురాలు వచ్చిన తరువాత ఆమె అల్తూనాలో లభ్యమయినంత ఉన్నతసంఘంలోకి వెళ్ళింది. ఆమె స్వయంగా విద్య నేర్చుకొన్నది. సుళువుబలువులను ఎరిగివుండటం వల్ల, సమత సంపాదించుకున్నది. ఎటువంటి పరిస్థితులయినా చక్కదిద్దుకోగల సౌజన్యం ఆమెకున్నది. ఉద్యానకృషి, పుష్పాలతో ఆమె తన జీవితాని కబ్బిన నూతనదశను అనుభవించట మారంభించింది.

కొద్దికాలం క్రితం భార్య చనిపోవటం వల్ల, మిస్టర్ స్కాట్ తన గృహ పర్యవేక్షణకోసం తన మేనగోడలు మిస్ రెబెక్కా స్టీవార్డును తీసుకువచ్చాడు. ఆమె సొగసైన యువతి. ఆండ్రూ కంటే వయసున కొన్ని యేళ్ళు పెద్దది. అతడికి