డెషియస్ : ఇదే తూర్పు. ఇక్కడే సూర్యోదయమౌతుంది.
కాస్కా: కాదు.
సిన్నా : క్షమించండి. ఇక్కడే ఉదయమౌతుంది. అవిగో, దూరంగా మేఘపుంజాల మీద కోపం కక్కుతూ, అవిగో అరుణరేఖలు దివాదేవి వార్తావహులు.
కాస్కా : మీరు ఇరువురూ మోసపోయారు ఈ విషయం అంగీకరిస్తారు కూడాను. నేను నా కత్తిని చూపించేవంక, వత్సరయౌవ్వన కాలాన్ని బట్టి పరిశీలించండి. ఇంకా సుదూరాన, దక్షిణాన సూర్యుడు ఉదయిస్తాడు. ఇంకా రెండు నెలలకు ఎంతో ఎత్తున ఉత్తరాన అతడు తన కాంతిపుంజాలతో ప్రకాశిస్తాడు. నిజమైన తూర్పుదిక్కు ఇక్కడికి సభాభవనంలా సూటిగా ఉంది.
బ్రూటస్ : ఒకరి తరువాత ఒకరు నాతో కరచాలనం చెయ్యండి.
కాషియస్ : మన నిర్ణయాన్ని గురించి శపథం చేద్దాం.
బ్రూటస్ : ఎందుకు. శపథంతో పని లేదు. మన ముఖాలల్లో వ్యథ వ్యక్తం కాకపోతే, ఆత్మల్లో అశాంతి ప్రబలకపోతే, కాలంలో దౌష్ట్యం కలతపెట్టకపోతే, - ఈ రీతి కారణాలన్నీ బలహీనాలైతే - ఇంకా మనం ముందుకు పయనించక ముందే మాంద్యం వహించి మన శయ్యాగారాలను చేరుకుందాం. ఒక్కొక్కరివంతు వచ్చి పూర్తిగా మనం రాలిపోయే దాకా దీర్ఘదృష్టి గల క్రూరపాలనను కొనసాగనిద్దాం. ఈ మూలకారణాలే శక్తిమంతాలైతే, కాకేం - శక్తిమంతాలే, పిరికిపందలను మహా వీరులనుగా రగులుస్తాయి. కరిగిపోయే స్త్రీల హృదయ భావాలకు పౌరుషకవచా లౌతాయి. దేశీయులారా! మనను మనం ఉద్దరించుకోటానికి ప్రేరేపించిన మన కారణాలు తప్ప వేరే శపథాలతో గాని, మరో వాటితో గాని మనకు పనేముంది? రహస్య గోపనంలో ఖ్యాతిగన్న రోము ప్రజల మాట, కల్లబొల్లి కానిమాట, చాలదూ? 'సత్యసంధులు సత్యసంధులతో ఇది చేసి తీరాలి చచ్చి తీరాలి' అని చెప్పిన మాట చాలదూ? మరో బంధమెందుకు? ఛాందసులు, పిరికిపందలు, మోసకారులు, నిరుపయోగులు, ఇలాగే ఇంకా చెడుగులను ఆహ్వానించే వ్యథితహృదయులూ శపథం చేస్తుంటారు. మానవులను అనుమానించే వ్యక్తులు దుష్ట చర్యలకు పూనుకున్నప్పుడు శపథం చేస్తుంటారు. మన కారణాలు గాని, ఆభరణ విధానాలు గాని శపథాన్ని ఆశిస్తవని భావించి మన సాహసకృత్య సద్గుణాన్ని గాని, అణచరాని మన అనంత ధైర్యాన్ని గాని కళంకితం చెయ్యవద్దు. రోము పౌరుని నోట వెలువడిన శపథంలో ఏ అణుమాత్రం తప్పినా అతడు
60
వావిలాల సోమయాజులు సాహిత్యం-3