Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వారం దగ్గరనే మిసెస్ లోంబయర్టుకు "ఇతడే మిస్టర్ స్కాట్స్ వాళ్ళ అండీ" అని పరిచయం చేశాడు. అతడు కార్యాలయంలో కనిపించేటంతటి శీతలంగా ఇంటిదగ్గర కనిపించలేదు. తన్ను గురించి చేసే పై రీతి పరిచయాన్ని విన్న తరువాత అందరూ తన్ను అలా చెప్పుకొంటుంటే తృప్తిని పొందేటట్లు అండీకి స్కాట్ మీద గౌరవం కలిగింది. ఒకనాడు రైల్రోడ్ అధ్యక్షుడు ఎడ్గర్ థామ్సన్ యువకుడయిన అసిస్టెంటు గదిలోకి తొంగి చూసి “స్కాట్స్ అండీవి నీవేనా?" అని ప్రశ్నించాడు. ఇది అతనికి సర్వసాధారణమైన పేరైపోయింది.

ఒకరోజున ఆండీ కార్యాలయానికి వెళ్ళేటప్పటికి, తూర్పు డివిజన్లో ఒక ప్రమాదం సంభవించటం వల్ల పశ్చిమానికి వెళ్ళవలసిన ఎక్స్ ప్రెస్ ఆలస్యమైందనీ, తూర్పునకు వెళ్ళే పాసింజెర్లు వంక దగ్గర ఒక ఫ్లాగ్ మానును ముందు పంపిస్తూ నెమ్మదిగా ప్రాకుతున్నట్లు నడుస్తున్నవనీ, రెండు వైపులకు వెళ్ళవలసిన సామాను బండ్లు ప్రక్క పట్టాల మీద నిలిచిపోయినవని తెలుసుకున్నాడు. ఒకేదారి వున్న రైలు మార్గాల పద్ధతిలో బండ్లు నడవటం ఇంకా ఎంతో అనాగరికస్థితిలో వుంది.

మిస్టర్ స్కాట్ ఎక్కడ వుందీ ఎవరికీ తెలియదు. బహుశః అతణ్ని ఏదో పనిమీద పిలిచి వుంటారు. ఏర్పడ్డ పరిస్థితికి అండీ కళవళపడుతున్నాడు. ఎంతో పనిచేసి చాలా అలిసిపోయిన చోదకులకు విశ్రాంతి నిచ్చి పరిస్థితిని కొంత చక్కదిద్దాలనే కుతూహలాన్ని అతడు ఆపుకోలేకపోయినాడు. ఇటువంటి అత్యయిక పరిస్థితులను పూర్వం ఇతడు మిస్టర్ స్కాట్ సూచనలతో అతడు సరిదిద్దాడు. అందువల్ల అతడు తన బాధ్యత మీదనే బండ్లను నడిపించటం, అవి కలుసుకునే ప్రదేశాలను నిర్ణయంచటం జరిగించాడు. చివరికి పై అధికారి వచ్చేటప్పటికల్లా సర్వం సుగమంగా సాగిపోతున్నది.

ఆండీ బల్ల దగ్గిరికి అతివేగంగా చొచ్చుకోవచ్చి "మంచిది. పరిస్థితులు ఎలా వున్న" వన్నాడు.

"మిస్టర్ స్కాట్, నాకు మీరు ఎక్కడా కనిపించలేదు. మీ పేరుమీదనే ఉదయం ఆర్డర్ల నిచ్చాను" అని సమాధానం చెబుతున్నప్పుడు ఆండీకి గొంతు బాగా పెగిలి రాలేదు.

అతడు ఇచ్చిన ఆర్డర్ల కాపీలన్నింటినీ చూపించాడు. లైను మీద వున్న బండ్లన్నీ సామాను బండ్లు, పాసింజరు బండ్లు - ప్రస్తుతం ఏ స్థితిలో, ఎక్కడెక్కడ వున్నదీ తెలియజెప్పాడు. చెప్పటం ముగించగానే సూపరింటెండెంటు ఆశ్చర్యపడుతూ ఆండీ