Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయానికి లైబ్రేరియన్ గా ఉన్నాడు. 'డ్యూ డ్రాప్' అనే పేరుగల ఆ సండే స్కూల్ పత్రికకు అప్పుడప్పుడూ చిన్న చిన్న రచనలు చేస్తుండేవాడు. ఈ చిన్న రచనల్లో ఒకటి యుద్ధవ్యతిరేకతను నిరూపించేది అయి వుండటం ముఖ్యంగా గమనింపదగ్గ విషయం. దీనిని అతడు తన పద్దెనిమిదోయేట క్రిమియాలో ఇంగ్లండు రష్యామీద యుద్ధం చేస్తున్న మొదటి సంవత్సరం వ్రాశాడు. అతడు చర్చిలో పాట పాడుతుండేవాడు. సంగీతం వినటమంటే అతడికి మంచి ఆసక్తి, అయితే చర్చి సంగీతపు నాయకుడు ఒప్పుకొన్నట్లు అతడి కంఠంలో ఆశించదగ్గది ఏదో కొంత ఉంది. ఏమైనా, ఎప్పటిలాగానే అతనికి ఈ అనుభవం వల్ల కొంత లాభం కనిపించింది. అది తరచుగా పాడే 'బాఖ్ కోరల్స్' మీద క్రొత్త అభిలాష కలగటం, మంచి సంగీతాన్ని ప్రశంసించగల శక్తి పెరగటం, మంచి సంగీతమంటే అభిరుచి ఏర్పడటం.

స్కాచ్ వారైనప్పటికీ అతని తల్లిదండ్రులు ఆలోచనారీతిలో ఉదారత ఉన్నవాళ్ళని, చలికాలంలో ఒక శనివారం నాడు అలిఘనీనది గట్టిగా, నునుపుగా గడ్డ కట్టినప్పుడు నిరూపితమైంది. ఆదివారం నాడు ఆటపాటలంటే స్కాచ్ వారు ఎంత పట్టుదల వహిస్తారో జ్ఞప్తికుండి కూడా స్కేటింగ్ అంటే అతిప్రీతిగల ఆండీ, ఆ నాటి సాయంత్రం కొంత అనుమానిస్తూనే తల్లిదండ్రులతో "రేపటి ఉదయం చర్చికి వెళ్ళబోయేముందు కొద్దిసేపు నేను స్కేటింగ్ చేయవచ్చునా.” అన్నాడు.

విశాల హృదయం గల తల్లి అన్నది. “నీ కెంతసేపు ఇష్టమైతే

అంతసేపు స్కేట్ చేయవచ్చు?" “అంతసేపు నేను ఒప్పుకోను” అని ఆమె అభిప్రాయానికి తండ్రి ఒక సవరణ చేశాడు. "ఆండ్రా! ఉదయం కొంతసేపు స్కేటింగు చెయ్యటంలో నాకేమీ అభ్యంతరం లేదు. కాని, నీవు నాతో కలిసి చర్చికి పోవటానికి సకాలంలో ఇంటికి తిరిగి వచ్చేయాలి.”

అందువల్ల ఆండీ పెందలకడనే లేచాడు. గడ్డ కట్టిన నదిమీద కొన్ని గంటలు గడిపాడు.