ఉండవలసి ఉంది. కార్నెగీ తరువాతి కాలంలో ఇలా వ్రాశాడు. "మానవుడు నేటివరకూ కూడబెట్టిను కోటానకోట్ల ద్రవ్యసంపదనంతటినీ ఇచ్చినా దానికి ప్రతిగా దేనిని ఇవ్వలేనో, అటువంటి సాహిత్యాభిరుచిని నాకు కలిగించిన అతనికి.” ధనవంతుడైన తరువాత కార్నెగీ అలిఘనీకి ఇచ్చిన గ్రంథాలయంలో హాలుకు ముందు కల్నల్ స్మృతిచిహ్నంగా అతడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దాని క్రింద ఉన్న రచనలో కొంతభాగం ఇలా ఉంది.
“పశ్చిమ పెన్సిల్వేనియాలో ఉచిత గ్రంథాలయ స్థాపకుడైన కల్నల్ ఆర్డర్సన్క.. ఇది వేటి మూలంగా యువకులు ఆరోహింపగలరో, అట్టి అమూల్య జ్ఞానభావనానిధులు ఎవరికి ఆరీతిగా వివృతం చెయ్యబడ్డవో ఆ “కార్మిక బాలకు" లలో ఒకడైన ఆండ్రూ కార్నెగీ కృతజ్ఞతాపూర్వకంగా నెలకొల్పిన స్మృతిచిహ్నం”
తన చెలికాండ్రయిన జాన్ ఫీప్స్, టామ్ మిల్లర్, జిమ్మీ విల్సిన్, విల్లీ కౌలీలతో బాటు మిస్టర్ ఫిప్స్ పాదరక్షల నిర్మాణశాలలో గడిపేది తప్ప మిగిలిన సాయంతనాల నన్నింటినీ - ఇంటిదగ్గర ఉండే ప్రతి రెండో సాయంతనాల నన్నింటినీ - ప్లూటార్లోవ్స్ మెకాలే లాంబుల వ్యాసాలు, మెక్సికో పెరూలమీద స్పైనీయులు చేసిన విజయయాత్రలను గురించి ప్రెస్ కాట్ రచించిన చరిత్రలు, మిగిలిన అన్నింటికంటె అతిశ్రద్ధతో పఠించిన బాన్ క్రాఫ్ట్ కృతి హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ చదవటంతో అతడు గడిపివేసేవాడు. అతడు కొన్ని సాంకేతిక గ్రంథాలను, ముఖ్యంగా లోహనిర్మాణాన్ని (Iron Making) గురించినవి, అతిజాగరూకతతో పఠించాడు. అప్పుడు ఎవరూ గ్రహింపకపోయినప్పటికీ, ఇది అతని భవిష్యత్తు కొక సూచికగా కనిపిస్తున్నది.
అంకుల్ జార్జి లాడర్తోను, యువ జార్జితోను, బాల్యంలో తన ప్రీతికి పాత్రుడైన కజిన్హాడ్తోను అతడు ఎప్పుడూ ఉత్తరప్రత్యుత్తరాలు నడుపుతుండేవాడు. ఆ లేఖల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని స్వేచ్ఛాసాహసాలను గురించి అత్యుక్తులు, గర్వోక్తులు ఉంటుండేవి. ఈ లేఖలే కజిన్ డాడ్ మనస్సులో బీజాలను నాటి, తరువాతి కొలది సంవత్సరాలలోనే అతడు అమెరికాకు వలస వచ్చేటట్లు చేశాయి.
విలియం కార్నెగీ స్వెడెన్ బోర్జియన్ చర్చిలో చేరాడు. అతని భార్య మతవిషయాల్లో తాను దూరంగా ఉంటున్నా, అతని విశ్వాసాలతో ఎట్టి ప్రమేయం పెట్టుకోలేదు. అండీ కొన్ని సంవత్సరాలు అక్కడి సండే స్కూలుకు వెళ్ళాడు. అప్పుడు అతడు విశేషంగా స్వెడెన్ బోర్జియన్ విషయాలమీద వ్రాసిన పుస్తకాలున్న సండే స్కూల్లోని చిన్ని