Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మోర్లాండ్, పిట్స్బర్గులో ఒక ప్రముఖుడయి, అటార్నీ పదవిని నిర్వహించిన వాడయి, అధిక సంపన్నుడయినాడు.

వార్తావహుడుగా ఆండ్రూ కార్నెగీ ఒక సంవత్సరం పనిచేసిన తరువాత ఒకనాడు మిస్టర్ గ్లాన్ పైనుంచి ప్రజాకార్యాలయంలోకి దిగివచ్చి మిస్టర్ బాక్స్, "నేను ఒక పనిమీద వెళ్ళుతున్నాను. యువకార్నెగీని కొన్ని క్షణాలపాటు కార్యాలయములో ఉండమనండి” అన్నాడు. అందువల్ల పెద్దదైన ఆ కర్తవ్యనిర్వహణకు హఠాత్తుగా పిలుపు తనకు వచ్చినందుకు ఆండీ కొంతగా చకితుడయినాడు. పంపవలసిన తంతి వార్తలను అందుకుంటున్నాడు. ఆపరేటర్ గది నుంచి బయటికి వచ్చిన వాటిని అందజేయటం కోసం వార్తాహారులకు పంచి యిచ్చాడు మిస్టర్ గ్లాస్ట అప్పుడప్పుడే రాజకీయాలల్లో ప్రవేశిస్తుండటం వల్ల, అతడు లేని సమయాలలో కార్యాలయవ్యవహారాలను చూడవలసిందని ఆండ్రూను తరువాత పదే పదే పిలవటం జరిగింది.

ఇప్పుడు బాలురకు పదకొండుంబాతిక డాలర్లు ఇస్తున్నారు. తరువాత వచ్చిన జీతపు రోజున పుచ్చుకోవటం కోసం బాలురందరూ వరుసగా నిలబడ్డారు. అండీ తల్లడిల్లినట్లుగానే అందరికీ జీతం బట్వాడా చేయటం జరిగింది. భీతి వల్ల అతడి తల తిరిగిపోతున్నది. అతన్ని అవసరం లేదని పంపించివేస్తారా ఏమిటి? అతని తప్పేమిటి? మిగిలిన పిల్లలందరూ గది విడిచిపెట్టి వెళ్ళిన తరువాత, మేనేజరు నీకు రెండుంబాతిక డాలర్లు అదనం వస్తుందని చెప్పి, అతడి చేతికి పదమూడున్నర డాలర్లిచ్చాడు.

అది ఒక శనివారం సాయంత్రం. తరువాతి కాలంలో ఆండీ ఇది బాగా గుర్తు పెట్టుకొన్నాడు. అతడు ఇంటికి రావటంలో చాలా భాగం పరుగెత్తుకుంటూ వచ్చాడు. నడిచే వాళ్ళతో బాట క్రిక్కిరిసి ఉండడం వల్ల, కోరినంత వేగంగా పరుగెత్తే అవకాశం లేకపోయింది. అందువల్ల అతడు బండ్లు వెళ్ళే మార్గాన అలిఘనీ బ్రిడ్జికి అడ్డంగా పడి పరుగెత్తి, ఇల్లు చేరుకున్నాడు. మధ్యలో ఒక నాటకీయమైన చిన్ని పథకాన్ని ఆలోచించాడు. రెబెక్కా వీథిని చేరుకోగానే ఉచ్ఛ్వాసం కోసం కొంత వేగాన్ని తగ్గించాడు. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడూ ఇస్తున్న పదకొండు డాలర్ల ఇరవైయైదు సెంట్లు తల్లి చేతికి ధైర్యంగా ఇచ్చాడు. తన కోసమని అతడు ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టకపోవటం వల్ల మిగిలిన పిల్లవాళ్లు అతనిని పిసినిగొట్టని అనుకుంటుండేవాళ్ళు. కార్నెగీ కుటుంబసభ్యులమధ్య ఎంతటి సాన్నిహిత్యమున్నదో కుటుంబంలో సంపాదించే ముగ్గురు, ఇంటిలోకి వస్తుసామగ్రిని, ఫర్నిచరు, దుస్తులను కొనటానికీ, స్కాట్లండులోని