Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- - అది నమ్మలేనంత తక్కువ జీతం. అయినా, అది కుటుంబ నిర్వహణానికి తాను కూడా సాయపడిన వాడనౌతానన్న ఉద్దేశంతో, ఆండీ అది విని పరవశుడైనాడు. తరువాత అతడు తండ్రి సూర్యోదయానికి పూర్వమే లేచి చలికాలంలో ఇంకా ముందుగానే లేచి అతివేగంగా ఉదయభోజనం చేసి, స్తిమితంగా సాయంత్రం ఆరుగంటల వరకూ పనిచేయటం కోసం కర్మాగారానికి ఉరుకులెత్తేవాళ్లు. విల్లీ కార్నెగీ వ్యక్తిత్వంగల భావుకుడు. ఇతరుల ఆజ్ఞలకు లోబడి ఒక నిర్ణీతకార్యక్రమాన్ని అనుసరించి కూలికి ఒకరి దగ్గర పనిచేయటానికి ఏ మాత్రం తగనివాడు. నేతపని, యంత్రం మీద జరుగుతుండటాన్ని చూసి అతని అంతరాత్మ ఎదురు తిరుగుతుండేది. తట్టుకోలేక, కొన్ని నెలలు గడచిన తరువాత కర్మాగారాన్ని వదిలివేశాడు. అడపాదడపా తయారు చేసి ఇంటింటికి మైళ్ళ తరబడిగా నడిచివెళ్ళి, ఒకటో రెండో ఆ బల్లగుడ్డలను అమ్ముకొస్తుండేవాడు.

కుటుంబానికి తమ పూర్వదేశం నుంచి వలసవచ్చినవారితో పరిచయం వృద్ధి పొందుతున్న రోజుల్లో, ఆండ్రూ మరొక స్కాట్లండ్ దేశీయుడైన జాన్ ను కలుసుకున్నాడు. అతడు అతనికి చాలా ఎక్కువ జీతంతో - అంటే వారానికి రెండు డాలర్లు. ఒక వుద్యోగ మిస్తానన్నాడు. ఇంతవరకు అతడు చేయవలసి వచ్చిన అసంతృప్తికరమైన పనులన్నిటిలోకీ అది దొడ్డది. చిన్న ఇంజిను మీద దృష్టి నిలిపి దాని బాయిలర్ క్రింద నిప్పు వేస్తూ వికారమైన ఒక చీకటి కొట్లో అతడు పనిచేయాలి. అటువంటి పరీక్షాసమయం వస్తే దాన్ని సర్ విలియం వాలెస్ ఎలా ఎదుర్కొనేవాడో అని ఊహిస్తూ, తన ఉద్యోగం మీద ఉత్సాహాన్ని నిలుపుకోటానికి అతడు యత్నించాడు. ఉద్యోగం ఎంతో అసంతృప్తికరమైనది! అయితేనేం అతడు దాన్ని ఎంతగా అసహ్యించుకుంటున్నాడో అతడు తల్లిదండ్రులకు తెలియనివ్వకూడదు.

తన కర్మాగారంలో ఒక మూల బల్ల వేసుకొని కూర్చున్న మిస్టర్ హో - అతని కార్యాలయానికి కంతటికీ అతడొక్కడే ఉద్యోగివర్గం - ఒక రోజున కుర్రవాడైన ఆండీని పిలిచి అడిగాడు. "నీకు లెక్కలు బాగా తెలుసునా?” అని. - "ఆర్యా! తెలుసుననుకొంటాను” అన్న సమాధానం వచ్చింది.

“నీవు బాగా వ్రాయగలవా?”

"ఆర్యా! చాలా అందంగా వ్రాయగలను.