Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"Scots who have for wallace bled, Scots whom Bowse had often led, Welcome to your glory bed, Or to Victory."

అన్న పాతకాలపు స్కాచ్ వీరగీతాలను, పాడుకుంటూ పాడటం కంటె గొణుగుకుంటూ ఉండే సిగ్గరీ, సాధువూ అయిన తన తండ్రి అంటే ఆండ్రూకు ఎంతో భక్తి. -

“1314లో బానాక్ బర్న్ యుద్ధానికి ముందు ఇంగ్లీషు సైన్యానికి ఎదురుగా నిల్చిన తన సైన్యాన్ని ఉద్దేశించి రాబర్టు బ్రూస్ చేసిన ప్రసంగంగా ఈ 'స్కాట్స్...’ అన్న గేయం ఊహింపబడుతున్నదని, తన తండ్రి పాటను తొలిసారిగా మధ్యలో ఆపి, తనకు చెప్పి, తిరిగి ఎత్తుకొని ఎప్పుడు పాడాడో ఆండ్రూకు జ్ఞాపకం లేదు. కొన్ని సమయాలలో అతడు ఇది కూడా చేర్చి చెపుతుండేవాడు: "రాబర్టు బ్రూస్! మన మొదటి రాబర్టు బ్రూస్ రాజు అయినది ఇతడే బుజ్జీ! నీకు తెలుసునా? అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఇంగ్లీషు వారినుంచి స్కాట్లండ్ దేశానికి ముక్తిని కలిగించిన ఇద్దరిలో ఇతడొకడు. రెండవ వాడు సర్ విలియం వాలెస్." అతడు ఆసుక్రోవిని ఎడమనుంచి కుడికి, మళ్ళీ వెనకకు ఆడించేవాడు. "బ్రూసన్ను ఇక్కడే డన్ఫరైన్లోని అబ్బీలో ఖననం చేశారు... అతడు, అతని రాణి, అనేకమంది, మన రాజులు, రాణులు ఎంతోదూరం నుంచి మాల్కొ కాన్మోరుకు వచ్చారు. అతని రాణి మార్గరెట్. ఆమే 1075లో ఈ అబ్బీని స్థాపించింది” అని అతడు చెప్పేవాడు.

స్కాట్లండ్కు మధ్యయుగంలో రాజకీయ మతవిషయిక ముఖ్యనగరం కావటం వల్ల డన్ఫర్మ్ లైన్ వాస్తవికంగా ఒక చరిత్రాత్మకమైన చిన్న నగరం. అందులోని రాజసౌధం, మధ్యయుగపు మరికొన్ని కట్టడాలు, ఈ నాడు శిథిలావస్థలో వున్నవి. ఒకప్పుడు స్కాచ్ రాజకుటుంబం నివసించినదీ, ఇంగ్లండు రాజు చార్లెస్ I జన్మించినదీ అయిన రాజసౌధానికి సంబంధించిన ఒక గోడ మాత్రం నేటికీ పడిపోకుండా నిలచి వుంది. గౌరవనీయుడైన బ్రూస్ గోరీతో సహా రాజుల గోరీలకు, రాణుల గోరీలకు నీడనిస్తూ అందమైన నలుచదరపు బురుజులతో, ఎత్తయిన శిఖరంతో వున్న అందమైన గొథిల్ ఆబ్బీ ఇంకా నిలిచివుంది. డన్ఫర్మ్ లైన్ నుంచి ఆగ్నేయదిక్కుగా ఫిర్త్ ఆఫ్ ఫోర్త్ లోయగుండా చూస్తే, మబ్బులు లేని రోజున, పదిహేను మైళ్ళ దూరాన పొగల మధ్య కనిపించే ఎడింబరోలోని పొగ గొట్టాలు, గండశిలమీద ఉన్న దాని ఎత్తయిన దుర్గం కనిపిస్తవి.