Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతడికి బ్రతుకుమీద ఉన్న ఆశ అత్యద్భుతమైంది. నాడిపేరు చెప్పినప్పుడు నాకు ఒళ్లు జల్లుమంటుంది గగుర్పోడుస్తుంది. ఇంకా విశేషంగా వివరిస్తాను. అతడికి సంబంధించిన ఊహలు కలిగితేనే జాడ్యం రావటం సహజమైన నాకు, ఆత్మహత్య చేసుకొని అతన్ని అంతమొందించాలె నన్న భావం కలిగినప్పుడు, అతన్ని చూస్తే అతడిమీద ఉన్న మమకారం వల్ల, నాకెంతో జాలివేసేది.

నా “ఇదంతా నిష్ప్రయోజనకరమైన కథ. వివరించటానికి కాలవ్యవధి కూడా లేదు. ఇంతవరకూ పుట్టిన మానవుడెవరూ ఇటువంటి దారుణవేదనలను అనుభవించలేదు. ఇంతమాత్రం చెపితే చాలు. ఇటువంటి ఘోరబాధలకు అలవాటు పడ్డంత మాత్రంచేత, అది ఉపశమించేదేమీ లేదు. నా అంతరాత్మ మొద్దుపారింది నిస్పృహతో నిత్యసాంగత్యం ఏర్పడ్డది. అనేకవత్సరాలు నేను శిక్షను అనుభవించాను. తుట్టతుదిగా సంభవించిన ఈ ఆపత్తు నా స్వరూపాన్ని సర్వనాశనం చేసింది. నా ముఖం నాకు పోయింది. నా ఔషధప్రయోగాన్ని ప్రారంభించినప్పుడు తెప్పించిన భారీమొత్తం తరువాత, మళ్ళీ క్షారాన్ని తెప్పించటం జరక్కపోవడం వల్ల, అది ఐపోయింది. క్రొత్తగా ఔషధాన్ని తయారుచేయటం కోసం మరికొంత క్షారాన్ని తెప్పించాను. ఔషధం చేశాను. ఆ మందు పొంగింది. కానీ వర్ణంలో మొదటి మార్పు మాత్రమే కనిపించింది. రెండో మార్పు రాలేదు. ఔషధాన్ని పుచ్చుకొన్నాను. అయితే అది పనిచేయలేదు. లండన్ నగరాన్నంతటినీ ఆ క్షారం కోసం ఎలా గాలించానో, మీరు పూలవల్ల తెలుసుకోవచ్చు. అయినా ప్రయోజనం లేకపోయింది. అందువల్ల నాకు ప్రథమంలో లభించిన క్షారమే మలినమైందనీ, అటువంటి మాలిన్యం అందులో ఉండటం వల్లనే ఔషధం ప్రబలశక్తితో పనిచేసిందనీ నేను ఇప్పుడు గ్రహించక తప్పటం లేదు.

“ఒక వారం గడిచింది. నేను ఇప్పుడు క్రొత్త క్షారంతో తయారుచేసిన ఔషధప్రభావంతోనే ఈ వాఙ్మూలాన్ని పూర్తి చేస్తున్నాను. హెన్రీ జెకిల్ తన సహజమైన ఊహలను చేయటానికి ఇదే తుదిసారి. అతని ముఖాన్ని కూడా తుదిసారిగా ఇప్పుడే అద్దంలో చూచుకుంటున్నాడు. (అయ్యో! అది ఎంత విషాదకరంగా మారిపోయింది) ఇంతటి మహామాయ లోకంలో ఇంకోటి ఉంటుందనుకోను. ఇక కాలయాపన చెయ్యకుండా నా రచనను ముగించాలి. నా ఈ వాఙ్మూలం ఇంతవరకూ హైడ్ చేతుల్లో పడకుండా తప్పించుకొన్నదంటే, అది నేను విశేషంగా తీసుకొంటున్న జాగరూకతవల్లనూ, అదృష్టం వల్లనూ సాధ్యపడింది. ఈ రచన చేస్తున్నప్పుడే నాకు రూపపరివర్తనకు సంబంధించిన వేదన కలిగితే, హైడ్ జన్మించి ఉండే వాడు.