విడదీయవచ్చు. ఇలా రెంటినీ విశ్లేషణం చేసి పృథఃకరింప గలిగినప్పుడు మానవుడు దుశ్చింతలకు పాల్పడడు. వాటి ప్రేరణలవల్ల దుష్కార్యాలను చేయడు. పశ్చాత్తాపాలకు గాని, పరాభవాలకుగాని గురికాడు. ఉత్తమ మార్గాలలో సంచరించి ఉన్నతాశయాలను సాధింపగలుగుతాడు. మానసికోల్లాసాన్ని కలిగించే సత్కార్యాలలో సంచరిస్తాడు.
ఈ రీతిగా ఈ భిన్నప్రకృతులనే రెండు మోపులను కలిపికట్టటం, బాధావ్యథితమైన మానసికగర్భంలో ధ్రువాంతరాలు గల ఈ కవలలు నిరంతరం ద్వంద్వయుద్ధం సాగించడం మానవజాతికి తగిలిన మహాశాపం! అయితే ఈ రెంటినీ పృథఃకరించటం ఎలా?
ఈ రీతిగా ఆలోచనానిమగ్నుడినై పరిశోధనాలయంలో బల్లముందు ఉన్నప్పుడు నాకొక వెలుగు కనిపించింది. ఇతః పూర్వం నేను చెప్పిన దానికంటే విస్పష్టరూపంలో, దుస్తులు ధరించి తిరిగే మన దేహంలో కదలాడుతుండే ఒక ద్రవస్వరూపం, ఒక మంచువంటి అంతరికశక్తి నాకు గోచరించటం ప్రారంభించింది. ఒక మంటపంలోని తెరలను చండవాయువు కదిలించినప్పుడు కనిపించేటంత స్పష్టరూపంలో, ఈ చర్మసంపుటిని కదలించి అందులోని వ్యక్తులను విడగొట్టే శక్తిగల ప్రతినిధి సాధనాలను నేను ప్రదర్శించగలిగాను. రెండు ఉత్తమకారణాల కారణంగా నేను నా ప్రకటనకు సంబంధించిన శాస్త్రీయవిషయాలను వివరింపదలచుకోలేదు. వాటిలో మొదటి కారణం మన జీవితభవిష్యత్తుకు సంబంధించిన భారం మన భుజస్కంధాల మీదనే మోపబడి ఉన్నదాన్ని తొలగించేటానికి యత్నాలు చేస్తే, ఆధారం మరింత తీవ్రంగా, అసాధారణశక్తితో మనమీద జైత్రయాత్రకు రావటం, రెండో కారణాన్ని నా కథనమే మీకు సుస్పష్టం చేస్తున్నది. అది దురదృష్టవశాన నాపరిశోధన అసమగ్రంగా నిలిచిపోవటం. అయితే నాకు ఒకటే సంతృప్తి. నన్ను ఆవరించిన కొన్ని ప్రభావమండలకాంతులనుంచి వేరుచేసి, నేను నా సహజస్వరూపాన్ని గుర్తింపగలిగాను. ఈ శక్తుల ప్రభావాన్ని తొలగించి నాకు సహజాలై, నా అంతరాత్మలో నిద్రిస్తున్న నీచ ప్రకృతులకు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోటం కోసం మరొక క్రొత్తరూపాన్ని, ముఖాన్ని ఇవ్వగల ఔషధాన్ని కనుక్కోగలిగాను. ప్రయోగాత్మకంగా ఈ సిద్ధాంతాన్ని, నిరూపించటానికి ఉపక్రమించ బొయ్యేముందు, నేను ఎంతో సంకోచించాను. ఈ ప్రయోగాన్ని నిర్వహించటంలో ప్రాణాలను పోగొట్టుకొనే అవకాశం కూడా ఉందని నాకు స్పష్టంగా తెలుసు. ఈ ద్వంద్వప్రకృతి దుర్గానికున్న పునాదులను సహా కదిలింపగల శక్తి ఉన్న ఏ మందైనా,