Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అఘోరభయం నన్ను వెంటాడుతున్నది. నా రోజులు దగ్గరకు వచ్చినవనీ, నేను మరణించకతీరదనీ భావిస్తున్నాను. నేను మరణించినా అజ్ఞానిగా మరణిస్తాను గాని, మహిమాన్వితుణ్ణిగా మరణించదలచుకోలేదు. జెకిల్ అతని నైతిక ప్రవర్తనను గురించి పశ్చాత్తాపపడుతూ, కన్నీరు కారుస్తూ ఎన్నెన్నో చెప్పాడు. అవి నా మనస్సుకు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నేను భయకంపితుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను. (దానిని మీరు గౌరవిస్తే) అట్టర్సన్! ఒక విషయం చెప్పుతున్నాను అది ఒక్కటే చాలు. ఆనాడు నా ఇంట్లో ప్రవేశించిన భూతం హైడ్ అనే నామంతో తిరుగుతున్న వ్యక్తి. ఈ విషయం జెకిల్ ఒప్పుకొన్నాడు. భూమి నలుమూలలా వెతుకుతున్నది 'క్యారూ' హంతకుడైన ఈ హైడ్ కోసమే!

                           హెప్టీ లాన్యన్.”