ఈ పుటను అచ్చుదిద్దలేదు
పరిశీలించాలి. నేను మళ్ళీ అర్ధరాత్రిలోగా ఇక్కడికి వస్తాను. అప్పుడు మనం పోలీసువారికి విషయాన్ని తెలియజేద్దాం.” పరిశోధనశాల తలుపు తాళంవేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినారు. హాల్లో అగ్నిధావని దగ్గర ఉన్న సేవకులనూ, సేవకురాండ్రనూ అక్కడనే ఉండమని, ఈ మాయా వ్యవహారంలోని మర్మాన్నంతటినీ వివరించే రెండు గాథలనూ, ఒకటి లాన్యన్ కథనం, రెండవది జెకిల్ వాఙ్మూలం - చదవటం కోసం తన కార్యాలయానికి అట్టర్సన్ నడక సాగించాడు. 522 వావిలాల సోమయాజులు సాహిత్యం-3