పూల్ గుసగుసగా "బాబూ! ఈ అద్దం చాలా వికారరూపాలను చూపిస్తున్నదండీ!" అన్నాడు. అతని మాటలకు ప్రతిధ్వనిగా. అతడుపయోగించిన మెత్తని గొంతుకతోనే “ఇంతకంటే విపరీతవస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉంటుందని నేననుకోను” అన్నాడు అట్టర్సన్. "దీనితో జెకిల్ ఏమి చేసి ఉంటాడు?" - ఇలా ప్రశ్నించేటప్పుడు మొదట్లో అతని నోట మాట తడబడ్డది. మళ్ళీ తనదైన్యానికి తానే సిగ్గుపడి "దీనితో జెకిల్కు ఏం పని పడి ఉంటుంది?" అన్నాడు మళ్ళీ. “అది మీరు నిర్ణయించాలి. నాకేం తెలుస్తుంది?" అన్నాడు పూల్. తరువాత వారి దృష్టి కార్యాలయకక్ష్యలో ఉన్న మేజా బల్లమీద పడింది. ఆ బల్లమీద చక్కగా అమర్చిఉన్న ఎన్నో పత్రాలమధ్య డాక్టర్ జెకిల్ స్వహస్తంతో అట్టర్సన్ పేరు వ్రాసి ఉంచిన ఒక కవరు బాగా పైకి కన్పిస్తున్నది. న్యాయవాది దాని సీలు ఊడదీసినప్పుడు అందులో నుంచి మరికొన్ని కవర్లు నేలమీద పడ్డాయి. ఇలా వ్రాసిన కవర్లలో మొదటిది ఆరు నెలలవాడు తాను డాక్టర్ జెకిల్కు తిరిగి ఇచ్చివేసిన విల్లునామాలోని వింత షరతులతో వ్రాసిన క్రొత్త వీలునామా. వ్రాసిన వ్యక్తి దీన్ని తాను మరణించిన పక్షంలో ఇచ్ఛా ప్రపచనంగానూ, అదృశ్యుడైన పక్షంలో దానపత్రంగానూ ఉద్దేశించి వ్రాశాడు. అయితే, ఇందులో పూర్వపత్రంలో లేని విశేషమేమిటంటే "ఎడ్వర్డు హైడ్" అనే పేరు ఉండవలసిన స్థానంలో "గేబ్రియల్ జాన్ అట్టర్సన్" అనే పేరు ఉండటం. ఇది చదివినప్పుడు న్యాయవాది అట్టర్సన్ వర్ణనాతీతమైన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు. ఒకమారు పూల్వంక, మరొకమారు ఆ పత్రంవంక, తిరిగి తిరిగి చూచాడు. చిట్టచివరకు మాత్రం తివాచీ మీద చచ్చిపడి ఉన్న క్రూరకర్ముణ్ణి హైడ్ను చూచాడు. “నా తల తిరిగిపోతున్నది. అంతా అయోమయంగా ఉంది. ఇన్నాళ్ళబట్టీ ఈ వీలునామా వీడి వశంలోనే ఉంది. నేనంటే వీడికి అనురాగం కలగటానికి కారణం ఏమీ కన్పించటం లేదు. వీడు తనకు బదులుగా మరో వ్యక్తి ఇంటికి, ఆస్తికి అధిపతి ఔతాడంటేనే మండిపడవలసినవాడు. ఇటువంటి స్థితిలో ఇంతకాలం తనవశంలో ఉన్న ఈ పత్రాన్ని ఎందుకో రూపుమాపలేదు!" న్యాయవాది తరువాత పత్రాన్ని చేతపుచ్చుకొన్నాడు. ఇది డాక్టర్ జెకిల్ స్వహస్తంతో వ్రాసి పైన ఒక అంచుమీద తేదీ వేసిన లఘులేఖ. దాన్ని చూచీ చూడకముందే 520 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/520
స్వరూపం