Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒక పక్కగా నిలువబడి వినవలసిందని కోరాడు. తాను క్రొవ్వొత్తి క్రిందపెట్టి, చెదురుతూ ఉన్న మనస్సును చిక్కబట్టుకొని, తలుపుకు తగిలించి ఉన్న పిడిని పట్టుకొని తడబడుతున్న చేతితో తలుపు తట్టాడు. "బాబూ! మిమ్మల్ని అట్టర్సన్ గారు చూడాలని వచ్చారు” అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడే ఏమి సమాధానం వస్తుందో వినమని మళ్ళీ ఒకమారు అట్టర్సనక్కు సైగ చేశాడు. “నేను ఎవర్నీ చూడదలచలేదని వారితో చెప్పు” అని మంచి విసుగుదలతో లోపలినుంచి ఒక కంఠం సమాధానం వచ్చింది. ఏదో విజయాన్ని సాధించిన తృప్తి ద్యోతకమయ్యే గొంతుకతో “చిత్తం" అని అన్నాడు పూల్. మళ్ళీ కొవ్వొత్తి చేత పుచ్చుకొని అట్టర్సన్న పెరటిగుండా వంటశాలలోకి తీసికోవెళ్ళాడు. అక్కడ నిప్పు పూర్తిగా చల్లారి ఉంది. నేలమీద పురుగులు గంతులేస్తున్నవి. అట్టర్సన్ కళ్ళల్లోకి చూస్తూ పూల్ ప్రశ్నించాడు. “బాబూ! అది మా యజమానిగారి గొంతుకేనా?" అతని చూపులో చూపు నిలిపాడే గాని, తెల్లబోయిన ముఖంతో అట్టర్సన్ “కంఠస్వరంలో గొప్ప మార్పు వచ్చినట్లు కనిపిస్తున్నది" అన్నాడు. "మార్పు వచ్చినట్లున్న దంటున్నారా? నాకు అలా తోచటం లేదు.” అన్నాడు బట్లర్. యోచించి మళ్లా అందుకొని “యజమాని ఇంట్లో ఇరవైఏళ్ళబట్టీ సేవ చేస్తున్నాను. నేనే వారి గొంతు గుర్తుపట్టలేకపోయినానంటారా? కాదు బాబూ! అది మా యజమానిగారి గొంతుకాదు. ఆయన అయిపోయినాడు. ఎనిమిది రోజులనాడే. 'ఓ పరమాత్మా!' అని కేకలు పెట్టిననాడే ఐపోయినాడు. అట్టర్సన్ మహాశయా! అయితే ఆయనకు బదులుగా గదిలో ఉంది ఎవరంటావు? ఎందుకక్కడ ఉన్నాడు? ఇదంతా పరమాత్ముడికే తెలియాలి" అన్నాడు పూల్. "పూల్, నీవు చెప్పేదంతా వింతకథగా ఉంది. వెర్రిగా ఊహిస్తున్నావు. నీవు భావించినట్లు, లేదా భావిస్తున్నట్లు మీ యజమానిని ఎవరో హత్య చేశారనే అనుకుందాం. ఇంకా హంతకుడు గదిలో ఎందుకుంటాడంటావు? నీవు చెప్పేది ఏమీ సబబుగా లేదు. ఆలోచన కెక్కడా సరిపోవటం లేదు.” “సరేలెండి! అట్టర్సన్ బాబూ! మీకు నచ్చచెప్పటం చాలా కష్టం. అయినా మీకు నమ్మకం కలిగించగలను" అన్నాడు పూల్. "మీరు వినాలి, క్రితంవారమంతా, ఆ 510 వావిలాల సోమయాజులు సాహిత్యం-3