అటు తరువాత ఫూల్ అతిజాగ్రత్తగా తలుపు తట్టాడు. లోపల గొలుసు తొలగించిన చప్పుడు వినిపించగానే "పూల్, నీవేనా?" అని ఒక కంఠం ప్రశ్నించింది?” "అవును. నేనే. తలుపు తెరవండి" అన్నాడు పూల్. బాగా దీపాలు వెలుగుతున్న హాల్లో వాళ్ళు ప్రవేశించగానే ఆ ఇంటి సేవకులూ, సేవకురాండ్రూ అంతా ఒక గొప్ప ఉంపుగా అగ్నిధావని ప్రక్కన గుమికూడి ఉన్నారు. అట్టర్సన్ నన్ను చూడగానే ఒక దాసీకన్యకు ఏదో ఆవేశం వచ్చి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. బానసీడు “బ్రతికాము స్వామీ! అట్టర్సన్ బాబు వచ్చారు” అన్నాడు. అతన్ని చేతుల్తో చుట్టివేయాలన్న కోరికతో ముందుకురికి పరుగెత్తుకోవచ్చాడు. “అరె!' మీరంతా ఇక్కడ గుంపుకూడి ఉన్నారా? ఇదేం బాగా లేదు. ఇలా ప్రవర్తిస్తే మీ యజమాని సహించడు” అన్నాడు. "వీళ్ళంతా భయపడిపోతున్నారండి బాబూ!" అన్నాడు పూల్. ఇంతటితో కొంతసేపు నిశ్శబ్దం. ఎవరూ పూల్ చెప్పిన మాటను కాదనలేదు. దాసీ కన్యమాత్రం ఇంకా ఎక్కిళ్లు పెడుతూ గొంతెత్తి ఏడుస్తూనే ఉంది. పూల్ ఆమెను “నోరు ముయ్!" అని గదమాయించాడు. ఆ కేక పెట్టినప్పుడు అతడు కూడా కంగారు పడుతున్నాడన్న విషయం కంఠధ్వనిలో కనిపిస్తున్నది. ఆ దాసీకన్య ఏడ్పు ప్రారంభించినప్పుడే వాళ్ళంతా బయలుదేరి బెదురు గుండెలతో లోపలి తలుపు దగ్గర ఏదో ఘోరం వినబడుతున్నట్లు భయంతో వెళ్లుతున్నారు. వంటశాలలో కూరగాయలు తరిగి ఇచ్చే కుర్రవాడితో పూల్ “ఒరేయ్! కొవ్వొత్తి దీపం అంచెలంచెలుగా అందుకుంటారు వెంటనే పంపించు" అన్నాడు. దీపం రాగానే అట్టర్సన్ ను తనవెంట రమ్మని ప్రార్థించి పెరటిలోని తోటలోకి దారితీశాడు. "చప్పుడు కాకుండా మీరు రాగలిగినంత మెల్లిగా రండి. మీకు ఏదైనా వినిపిస్తే వినండి అంతేకాని మీరు మాత్రం మాట్లాడవద్దు. ఆయన మిమ్మల్ని రమ్మని ఏ సందర్భంలోనైనా కోరితే మీరు వెళ్ళవద్దు.” ఇలా అంటాడని ఊహించని అట్టర్సన్ గుండె ఒక్కమాటు హఠాత్తుగా ఆగిపోయినట్లైంది. అల్లటతల్లట చేసింది కానీ వెంటనే తట్టుకొన్నాడు. ధైర్యం తెచ్చుకొని బట్లరు వెంట పరిశోధనా మందిరం గుండాను సీసాలూ, ఇతర వస్తుసామగ్రి చెల్లాచెదరుగా ఉన్న శస్త్ర పరిశోధనశాలలో నుంచి మెట్లదగ్గిరికీ వెళ్లాడు. పూల్ అతన్ని డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 509
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/509
స్వరూపం