Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూల్ బొంగురుగొంతుతో “ఏదో ఘోరం జరిగిందనే నమ్మకం" అని అన్నాడు. “ఘోరమా!” భయకంపితుడై “ఘోరం” అంటే నీ అభిప్రాయమేమిటి?" అని చీకాకుతో అడిగాడు అట్టర్సన్. “నాకు ఏమీ చెప్పటానికీ నోరాడటం లేదండీ! మీరు ఒక్కసారి నా వెంటవచ్చి స్వయంగా చూడగలరా?” ఇక దానికి అట్టర్సనక్కు మరో సమాధానమేముంది? వెంటనే లేచి టోపీ ధరించాడు. పెద్దకోటు వేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న బట్లరు ముఖంలో పోయిన ప్రాణాలు లేచివచ్చినట్లు కన్పిస్తున్నవి. న్యాయవాది ఇచ్చిన ద్రాక్షాసవాన్ని రుచైనా చూడకుండానే, అతడు అట్టర్సన్ వెంట బయలుదేరాడు. అట్టర్సన్ ఈ విషయం కూడా గమనించాడు. అది వెర్రిచలి వేస్తున్న మార్చి నెలరాత్రి. చంద్రుడు వెలవెలపోతున్నాడు! గాలి తన్ను తరిమి పంపిస్తున్నట్లుగా నడుస్తున్నాడు. మంచును ముక్కలు కొట్టి విరజిమ్ముతున్నదా అన్నట్లుగా వీస్తున్నది చలిగాలి. అందువల్ల వీథుల్లో మనుష్య సంచారమంటూ లేదు. ఆ వీథి నిర్మానుష్యంగా ఉన్నది. "లండన్ నగరంలోని ఈ ప్రాంతం ఇంత జనశూన్యంగా ఉండటం ఎప్పుడూ లేదనుకున్నాడు అట్టర్సన్. మరో సాటిమానవుడు కన్పిస్తే అతన్ని స్పృశిద్దామన్న కోరిక ఇంత తీవ్రంగా అతడి జీవితంలో ఎప్పుడూ కలగలేదు. ఏదో ఘోరవిపత్తు రానున్నట్లు అతని మనస్సు వేదనపడుతూ ఉన్నది. ఎంత యత్నించినా అది అణిగిపోవటం లేదు. చౌకులోకి ప్రవేశించాడు. ఆ కూడలిలో నిలుచోని చూస్తే దుమారం తప్ప ఏమీ కన్పించటం లేదు. తోటలో పలుచని చెట్లు గాలికి చలిస్తూ ఇనుప కటకటాలకు కొట్టుకుంటున్నవి. వేదికా మార్గాలమీద ఇంతవరకూ అట్టర్సన్ కంటే ఒకటిరెండడుగులు ముందుగా నడుస్తున్న పూల్ వెనక్కు తగ్గాడు. అంతటి చలిగాలిలో కూడా అతడు టోపీ తీసి ఒక ఎర్రని జేబు రుమాలుతో ముఖం తుడిచాడు. ఆ చెమట వేగంగా నడిచినందువల్ల కలిగింది కాదు. లోపల ఉరిపోస్తున్నట్లుగా ఉన్న వేదనవల్ల కలిగింది. అందువల్లనే అతని ముఖం తెలతెలబోతున్నది. కంఠస్వరం బొంగురుపోయి కంపిస్తూ ఉన్నది. "బాబూ! మనం ఇక్కడికి వచ్చేశాం. కానీ భగవంతుడి దయవల్ల ఏమీ ప్రమాదమూ సంభవించకుండా ఉండాలి" అన్నాడు పూల్. 508 “శుభమగుగాక!” అన్నాడు న్యాయవాది. వావిలాల సోమయాజులు సాహిత్యం-3