8. తుది రాత్రి ఒకనాటి సాయంకాలం భోజనం చేసి అట్టర్సన్ అగ్నిధావని ప్రక్కన కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చిన పూల్ను చూచి, ఆశ్చర్యపోయాడు. "ఏ పూల్, ఏదో పనిమీద వచ్చినట్లున్నావు?” అని భయంతో కేక పెట్టినట్లు అడిగాడు. మళ్లా మరొక్కమాటు అతన్ని చూచి, “నీవేదో బాధపడుతున్నట్లుగా ఉన్నావు? డాక్టరుకు జబ్బుగా ఉందా?" అని ప్రశ్నించాడు. "అట్టర్సన్ బాబూ! ఏదో ప్రమాదం సంభవించింది!" “రా, కూర్చో. ఒక చషకం ద్రాక్షాసవాన్ని పుచ్చుకో. తొందరేమీ లేదు. స్తిమితపడు. నీకేం కావాలో నెమ్మదిగా చెప్పు" అన్నాడు న్యాయవాది. పూల్ ఇలా అన్నాడు: "డాక్టరుగారి ప్రవర్తన మీకేమీ తెలియనిది కాదు. ఆయన ఎలా తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చుంటున్నదీ మీకు తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు మా ఇంట్లో తలుపులు బిగించుకొని కూర్చున్నాడు. ఎందువల్లనో నేను దాన్ని భరించలేకపోతున్నాను. అయ్యా! అట్టర్సన్ బాబూ! దాన్ని భరించటమంటే నాకు ప్రాణాలు పొయ్యేటట్లుగా ఉంది. నాకేమిటో వెర్రి భయం వేస్తున్నది” “ఎందుకలా బెదిరిపోతున్నావు? స్పష్టంగా చెప్పు. నీకు భయం దేన్నిగురించి?” అన్నాడు న్యాయవాది. "వారం దినాల నుంచీ నేను భయపడి పోతున్నాను. దీన్ని భరించలేను!” అని న్యాయవాది అడిగిన ప్రశ్నను వినిపించుకోకుడానే సమాధానం చెప్పాడు ఫూల్. అతని ప్రవర్తనరీతి కూడా అతని మాటలకు అనుగుణంగానే ఉంది. అది క్రమంగా మరింత అధ్వానం ఔతున్నది. మొట్టమొదటిసారిగా అతడు తన భయాన్ని గురించి నివేదించేటప్పుడు తప్పు, అతడు న్యాయవాదిముఖాన్ని కూడా తల ఎత్తి చూడలేదు. అతడు చూపును గదిలో ఒక మూలమీద నిలిపి మాట్లాడుతున్నాడు. "నేను దీన్ని మరింతకాలం భరించలేను” అన్నాడు న్యాయవాది. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 507
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/507
స్వరూపం