Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7. వాతాయనం దగ్గరి విశేషం అట్టర్సన్ యథాప్రకారంగా ఎన్ఫీల్డుతో వాహ్యాళికి వెళ్ళి వస్తూ ఉండగా, ఒక ఆదివారం నాడు వారు వెనుకటి ఉపవీథిని మరొకమాటు ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. ఆ భవనం ద్వారబంధం దగ్గిరికి రాగానే దాన్ని పరికించటానికి ఇద్దరూ “మంచిది. ఆ గాథసర్వం సమాప్తమైనట్లే ఇక హైడ్ మన కంటపడట మంటూ ఉండదు కదా!" అన్నాడు ఎన్ఫీల్డు. "ఉండదనే అనుకుంటాను. నేను అతడిని ఒకమాటు చూచాననీ, నీవు అసహ్యించుకొన్నట్లే నేనూ అసహ్యించుకొన్నాననీ నీకు నేనెప్పుడైనా చెప్పానా?" అని అట్టర్సన్ అడిగాడు. "అతడిని చూడటమంటూ జరిగితే అసహ్యభావం కలగకపోవటమంటూ ఉండదు. రెంటినీ విడదీయటం అసంభవం. ఆ విషయం అలా ఉంచండి. ఇది డాక్టర్ జెకిల్ దొడ్డిగుమ్మం కదండీ! అరె! ఇది నేను గాడిదలాగా తెలుసుకోలేకపోయానే! దీన్ని తెలుసుకోవటం కూడా కొంతవరకూ మీ లోపంవల్లనే జరిగింది" అన్నాడు ఎన్ఫీల్డ్. “అయితే నీవు తెలుసుకొన్నావన్నమాట! కనక మనం పెరట్లోనుంచి వెళ్ళి ఒకమాటు కిటికీలవంక చూచివద్దాం పద. నీకు నిజం చెపుతున్నాను. నేను జెకిల్ విషయంలో ఏం చెయ్యాలో తోచక చాలా ఆందోళనపడుతున్నాను. బయట ఉన్నప్పటికీ మిత్రులు కనబడితే అతనికి కొంత తృప్తి చేకూరుతుందని నా నమ్మకం.” పెరడు చాలా తేమగానూ, చల్లగానూ ఉంది. నెత్తిమీద సూటిగా ఆకాశాన ఇంకా అస్తమించే సూర్యుని కాంతులు ప్రకాశిస్తున్నా పెరట్లో ముందుగానే చీకటి ఆవరించింది. మూడు కిటికీలలో మధ్యది సగంగా తెరిచిఉంది. దాని ప్రక్కనే కూర్చొని 504 వావిలాల సోమయాజులు సాహిత్యం-3