Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంభాషించటమే విశేషంగా వాంఛించి ఉంటాడు. అయితే పాపం పూల్కు, అతడికి నివేదింపదగ్గ సంతోషకరమైన వార్తలంటూ ఏమీ ఉండటం లేదు. డాక్టర్ జెకిల్ నిరంతరం పరిశోధనమందిరానికి అవతల ఉన్న కక్ష్యలోనే ఉంటున్నాడు. తరచుగా అతడు అక్కడనే నిద్రిస్తున్నాడు కూడాను. అతడు తాను తానుగా లేడు ఖుషీ నశించింది. విశేషంగా మౌనముద్ర ధరించి ఉంటున్నాడు. గ్రంథపఠనం చెయ్యటం లేదు. అతని మనస్సును ఏదో తీవ్రంగా కలతపెట్టుతున్నట్లు కనిపిస్తున్నది. అతన్ని గురించి వస్తున్న వార్తల్లో ఎట్టి మార్పూ కన్పించకపోవటంతో, అట్టర్సన్ అలవాటు పడ్డాడు. తరచుగా జెకిల్ ఇంటికి ప్రయాణాలు చేస్తూ ఉండటం కూడా తగ్గించాడు. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 503