“ఇవాళే ఒక మిత్రుడి అంత్యక్రియలు పూర్తిచేయించి వచ్చాను ఈ ఉత్తరం మరొక మిత్రుని కూడా పోగొడుతుందేమో!" అని అతడు భావించాడు. లాన్యన్ ఎడ మిత్రద్రోహంగా కనిపించే ఈ భయాన్ని చంపుకొని అతడు సీలు విప్పదీశాడు. పై కవరు లోపల మరొక కవరు ఉంది. అది కూడా పైదానిలాగానే భద్రంగా సీలు చేసి ఉంది. దానిమీద "డాక్టర్ హెన్రీ జెకిల్ మరణించటమో, లేక అదృశ్యం కావటమే జరక్క పూర్వం తెరవరాదు" అని వ్రాసి ఉంది. అట్టర్సన్ తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. అదృశ్యుడు కావటమే! వ్రాసిన వ్యక్తికి తాను తిరిగి ఇచ్చివేసిన ఇచ్ఛాపత్రంలో కూడా ఇలాగే 'అదృశ్యుడన్న పదం ప్రయుక్తమై ఉంది. అందులో ఆ పదం బహుశః ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని సాధించటంకోసం స్పష్టంగానూ, ఘోరంగాను బయటపడిపోతూ ఉన్న హైడ్ కుత్సితపు సలహాలవల్ల చేరి ఉండవచ్చును ఇలా అనుకుందామా అంటే ఈ లేఖలో కూడా 'డాక్టర్ జెకిల్ అదృశ్యుడు కావటం' అన్నభావం తిరిగి కనిపిస్తున్నది. ఈ లేఖ లాన్యన్ స్వహస్తంతో వ్రాసింది. దీని అభిప్రాయం ఏమిటి? 'జెకిల్ మరణాంతరం లేదా అదృశ్యుడైన తరువాతనే చూడాలని అన్న లేఖమీది నిషేధాన్ని గౌరవించకుండానే, ఈ మర్మతంత్ర మంతటికీ మూలం ఏదో లోతుకు పోయి తెలుసుకోవాలన్న కుతూహలం లేఖకు ధర్మాధికారి అయిన అట్టర్సనక్కు కలిగింది. కానీ తన వృత్తినీతి, మర్యాద, మిత్రద్రోహం అనేవి రెండూ అతని త్రోసివేయజాలని ప్రతిబంధకాలైనవి. అందువల్ల అట్టర్సన్ తన ఆంతరంగికలోహపేటికలలో ఒక మారుమూలన ఆ లేఖను భద్రపరచటం వల్ల అది కొంతకాలం నిద్రపోవలసి వచ్చింది. రహస్యాన్ని తెలుసుకోవాలె నన్న కుతూహలాన్ని అణగద్రొక్కటం ఒక విషయం దాన్ని సంపూర్ణంగా జయించటం మరో విషయం. లాన్యన్ మరణానంతరం తనకు మిగిలిన ఒక మిత్రుడైన జెకిల్ను కలుసుకోవాలని వెనకటంత గాఢంగా ఇప్పుడు అట్టర్సన్ వాంఛిస్తున్నాడా అన్నంత అనుమానం కలుగుతున్నది. అయితే ఆ మిత్రుణ్ణి గురించి కరుణాన్వితమైన ఊహలే సాగిస్తున్నాడు. అతడి ఆలోచనలు కల్లోలితాలుగానూ, భయాన్వితాలుగానూ నడుస్తున్నవి. అయినా ఒకమారు మిత్రుణ్ణి చూచివద్దామని అతడి భవనానికి వెళ్ళాడు. ప్రవేశం తిరస్కృతమైంది. అందువల్ల అతడికి బాధ కలక్కపోగా ఒకవిధమైన హాయి కూడా చేకూరింది. ఆ గృహంలో ప్రవేశించి ఐచ్ఛిక బానిసత్వాన్ని అనుభవిస్తున్న అగమ్యగోచరునితో ప్రక్కన కూర్చొని సంభాషించే దానికంటే బహుశః అట్టర్సన్ స్వేచ్ఛాసంచారం గల నగర వాతావరణం మధ్య, సమస్తశబ్దాలనూ వినగలుగుతూ ఉండేచోట, జెకిల్ ఇంటిగుమ్మం ముందు మెట్లమీద, పూల్తో 502 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/502
స్వరూపం