గురించి వ్యాఖ్యానిస్తూ "నేను మరణం ఆసన్నమైన వ్యక్తిని" అని అతడు దృఢవిశ్వాసంతో ప్రకటిస్తున్నట్లు చూస్తూన్నాడన్నాడు అట్టర్సన్.
“నాకు గొప్ప మనోవైకల్యం కలిగింది. ఇక కోలుకోవటమంటూ కల్ల! నా జీవితం ఇక వారాలల్లోకి వచ్చింది. మంచిది. జీవితాన్ని ఇంతవరకూ మహానందంతో గడిపాను. నాకు బ్రతుకుమీద అధికాసక్తి ఉండేది ఆ కారణంవల్లనే నేను బ్రతుకును ప్రేమించాను. మనకు పరిపూర్ణ విజ్ఞానమే ఉంటే ఈ లోకంలోనుంచి వెళ్ళిపోవటానికే ఆసక్తిచూపుతామని నేను అప్పుడప్పుడూ అనుకొంటుంటాను" అన్నాడు డాక్టర్ లాన్యన్.
"జెకిల్ కూడా చాలా జబ్బుగా ఉన్నాడు మీరు చూచి వచ్చారా?” అని ప్రశ్నించాడు అట్టర్సన్.
ఈ ప్రశ్నకు లాన్యన్ ముఖం మారిపోయింది. వణికిపోతూ ఉన్న చేతిని పైకెత్తి అన్నాడు : " నేను డాక్టర్ జెకిల్ను చూడదలుచుకోలేదు సరిగదా, అతన్ని గురించి విననుకూడా తలచుకోలేదు. వాడితో నా ప్రాణం విసిగిపోయింది. చచ్చినవాళ్ళలో జమకట్టాను. వాడి ప్రస్తావన తీసుకు రావొద్దని కోరుతున్నందుకు నన్ను క్షమించండి.”
'ఛీ, ఛీ!' అన్నాడు అట్టర్సన్. తరువాత గమనార్హమైన కొంతకాలం ఆగి "లాన్యన్! నేను నీకు చేయగల సాయమేదీ లేదా?" అని ప్రశ్నించాడు. “మనం ముగ్గురం బహుకాల స్నేహితులం. ఇక మన జీవితంలో క్రొత్తమిత్రులను ఎన్నుకుండేది లేనే లేదు” అన్నాడు అట్టర్సన్.
“నాకు మీరు చేయగలిగిందంటూ ఏమీలేదు. ఏమన్నా ఉందేమో వెళ్లి అతన్ని అడగండి" అన్నాడు లాన్యన
"అతడు నాకు చూడటానికే అవకాశం ఇవ్వటం లేదు" అన్నాడు న్యాయవాది.
"అతడు చేసిన ఈ పనికి నాకేమీ ఆశ్చర్యం కలగటం లేదు. అట్టర్సన్! నా మరణానంతరం ఏదో ఒకనాడు ఈ విషయంలో ఉన్న మంచిచెడ్డలన్నీ మీకు తెలియవచ్చు. కానీ నేను మీకు ముఖతః వినిపించలేను. ప్రస్తుతం నాతో ఇతరవిషయాలేమైనా ఉంటే కూర్చోని మాట్లాడండి. తప్పక మాట్లాడండి. బాబో! చాలు, చాలు, దేవతలకు వేయి దణ్ణాలు. మీరు ఈ పాపిష్ఠిప్రసంగం తీసుకోరాకుండా ఊరుకోలేనంటారా, వెళ్ళిపొండి దాన్ని నేను భరించలేను!" అని అన్నాడు లాన్యన్.
500
వావిలాల సోమయాజులు సాహిత్యం-3