ఉట్టిపడుతూ కన్పిస్తున్నది. డాక్టర్ జెకిల్ ఇలా ఒక మాసద్వయానికి పైగా మహాశాంతిని అనుభవించాడు. జనవరి 8వ తారీఖున డాక్టర్ జెకిల్ కొంతమంది మిత్రులకు తన ఇంట్లో విందు చేశాడు. అందులో అట్టర్సన్ పాల్గొన్నాడు దానికి డాక్టర్ లాన్యన్ కూడా విచ్చేశాడు. ఈ మిత్రత్రయం వెనుక ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతటి సన్నిహితంగా మెలిగారు. ఈ విందు సందర్భంలో డాక్టర్ జెకిల్ వెనుకటి అనుబంధాన్ని స్ఫురింపజేసే స్నేహసద్భావాలతోటే మిత్రులిద్దరినీ చూచాడు. అయితే న్యాయవాది అట్టర్సన్ నెల 12, 14 తేదీలలో డాక్టర్ జెకిల్ ఇంటికెళ్ళితే ప్రవేశించటానికి వీల్లేకుండా తలుపు మూసిఉంది. "డాక్టరు బయటికి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఎవరికీ దర్శన మివ్వటంలేదు" అని ఫూల్ నివేదించాడు. అయితే అట్టర్సన్ తిరిగీ 15వ తేదీన మిత్రుని చూడటం కోసం అతని భవనానికి వెళ్లాడు. లోపలికి ప్రవేశించటం కోసం యత్నించాడు తిరస్మృతుడైనాడు. గడచిన రెండు మాసాలలో నిత్యం మిత్రుని చూడటం అతనికి అలవాటైపోయింది. అందువల్ల క్రొత్తగా కలిగిన ఏకాంతం అతని మనస్సుకు భారమనిపిస్తున్నది నాలుగు దినాలు ఎలాగో గడిచాయి. అయిదో నాటి రాత్రి గెస్టును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆరోనాడు తాను డాక్టరు లాన్యన్ ఇంటికి వెళ్ళాడు. అయితే అతడు అక్కడమాత్రం తిరస్కృతుడు కాలేదు. లోపలికి ప్రవేశించటంతోటే డాక్టరు ముఖంలో వ్యక్తమయ్యే మార్పును చూచి నిర్ఘాంతపొయ్యాడు. అతని కండలన్నీ కరిగిపోయి కనిపిస్తున్నాయి. మృత్యువు పంపిన ఆహ్వానం అందిన లక్షణాలు అతనిముఖంలో ద్యోతకమౌతున్నవి. నిగనిగలాడుతూ ఉండే మనిషి ఇప్పుడు ఎందుకో పాలిపోయాడు. అతని బట్టతల, వృద్ధాప్యం బయటపడిపోతున్నవి. అయినా అట్టర్సన్ నన్ను నిర్ఘాంత పెట్టింది అతని శరీరకార్శ్యం కాదు అవి అతనియందు స్థిరస్థానాన్ని ఏర్పరుచుకొన్న మానసికభీతిని వెల్లడించే కంటిచూపు, ప్రవర్తనరీతులు. డాక్టరుకు మరణభయం ఉండటం అసహజం అయినా అటువంటి భయం అతన్ని పట్టుకొన్నదని అట్టర్సన్ అనుమానించకుండా ఉండలేకపోయాడు. "అవును. అతడు వైద్యుడు. కనుకనే తన స్థితి ఎలా వుంటుందో అతడు తెలుసుకొని ఉంటాడు. తనకు గడువు దగ్గిరికి వచ్చి ఉంటుంది. మరణసంబంధమైన జ్ఞానం వల్ల కలిగిన భీతిభారం అతడి భారవహనశక్తిని మించిపోయింది" అని అతడు భావించాడు. ఆయన జబ్బుచూపును డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 499
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/499
స్వరూపం