Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6. డాక్టర్ లాన్యన్ విచిత్రోదంతం కాలం గడిచిపోతున్నది. సర్ డాన్వర్స్ మృతి ఒక ప్రజోపద్రవంగా భావింపబడటం వల్ల హంతకుణ్ణి పట్టి ఇచ్చినవాళ్ళకు వేయి పౌనుల ద్రవ్యం పారితోషికమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సజీవుడై ఉండి జనుల్లో కలిసి పోయాడా అన్నంత ఆశ్చర్యకరంగా పోలీసువారి దూరదర్శన దృష్టినుంచి హైడ్ అదృశ్యుడైనాడు. అతని పూర్వజీవితవిశేషాలను గురించి విశేషమైన దర్యాప్తు జరిగింది. అవన్నీ అప్రతిష్ఠాకరాలు. అతన్నిగురించి తెలియవచ్చిన ప్రతి కథా ఒక ఘాతుకకృత్యాన్నో, లేదా క్రౌర్యాన్నో వెల్లడించింది. ప్రతి కథా అతని క్రూర స్వేచ్ఛాసంచారాన్నీ, మర్యాదావిచ్ఛేదనాసక్తినీ ద్యోతకం చేసింది. వీటివల్ల అతని విచిత్రమైన సహచరులు ఎందరో బయటపడ్డారు. వారి మాత్సర్యప్రవృత్తి అద్భుతకరమై అభివ్యక్తమైంది. అయితే అతని ప్రస్తుతసంచారాలను గురించి గుసగుసగా కూడా ఇంతైనా వినిపించలేదు. హత్యచేసిననాడు అతడు ఉదయం తన సాహోప్రాంతంలోని ఇంట్లోనుంచీ వెళ్ళిపోయింది మొదలు తుడిచిపెట్టుకో పోయినాడు. కాలం గడిచినకొద్దీ అతడు పడే వేదనలోని వేడి తగ్గింది. అతడి మనస్సు ప్రశాంతి వహించి ప్రసన్నమైంది. హైడ్ ఇలా రూపు మాసిపోయి సర్ డాన్వర్స్ను హత్య చేసినందుకు అధికశిక్షనే అనుభవించాడని అట్టర్సనక్కు తోచింది. అతని దుష్టప్రభావం తొలగిపోయింది గనుక డాక్టర్ జెకిల్ జీవితంలో ఇక నూతనప్రకరణం ప్రారంభమైంది. ఇన్నాళ్ళబట్టి అతడు అనుసరిస్తున్న ఏకాంతాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చాడు. పూర్వ స్నేహితులందరితో మైత్రిని పునరుజ్జీవం చేసుకొన్నాడు. మళ్ళీ ఒక్క మారు తాను వారికి అతిపరిచితుడై అతిథి ఐనాడు. అతిథులను తన ఇంటికి ఆహ్వానించి సత్కారాలతో అనందప్రదానం చేసే అతిథేయి ఐనాడు, అతడు ఇతఃపూర్వం దానధర్మాలకు విశేషవిఖ్యాతి గన్నవాడు. ఈనాడు అలాగే మతపిపాసువై తత్తుల్యమైన విశిష్టతను ఆర్జించుకొంటున్నాడు. ఎల్లవేళలా ఏవో కార్యకలాపాలల్లో నిమగ్నుడౌతూ ఆదాన ప్రదానాలతో అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ సత్కార్యాలను సాధిస్తున్నాడు. అతని ఆంతరచైతన్యం సేవాసక్తమైందా అన్నట్లు ముఖంలో ఎప్పుడూ చూచినా తేజస్సు 498 వావిలాల సోమయాజులు సాహిత్యం-3