Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎవరినైనా సంప్రదించి సలహా పొందాలనే వాంఛ తీవ్రంగా కలిగింది. అయినా దాన్ని సూటిగా పొందటం అతనికి రుచించటం లేదు. ఎలాగైనా ప్రసంగవశాన దాన్ని పొందవచ్చునని అతడు ఊహించాడు. అనతికాలంలోనే అతడు ఇంటికి చేరాడు, 'అగ్నిధావని' ప్రక్కన ఒకవైపు తానూ మరొకప్రక్క అతని పెద్ద గుమాస్తా మిస్టరు గెస్టు కూర్చున్నారు. ఇరువురికీ మధ్యగా ఒక బల్లమీద ద్రాక్షాసవపు సీసా ఒకటి పెట్టి ఉంది. అది బహుకాలం ఎండతగులని ప్రదేశంలో ఉంచి భావన చేసింది. పొగమంచు గాలిమీద పడి నిద్రపోతూ ఇంకా లండన్ మహానగరాన్ని ముంచేస్తున్నది. వీథుల్లో దీపాలు మసకమసకగా రాచపుండుల్లా మండుతున్నాయి. కంబళ్లు కప్పినట్లుగా క్రిందికి వ్రాలుతున్న మేఘాల ముసుగుక్రింద మహానగరానికి సిరలుధమనులుగా ఉన్న వీథుల్లో జనులు వాత్యారయఝంకారాలకు చలిస్తూనే రాకపోకలు సాగిస్తున్నారు. కానీ అట్టర్సన్ గది అగ్నిధావనిలోని కాంతులవల్ల ఆనందోన్మత్తంగా ప్రకాశిస్తున్నది. ద్రాక్షారసపు సీసాలో ఉన్న క్షారాలు ఎప్పుడో విరిగిపోయినవి. త్రుప్పుపట్టిన కిటికీ రంగు బాగా పట్టినట్లున్న ఆ సీసామీది ముద్ర కాలం గడవటం వల్ల మెత్తపడిపోయింది. నగరసానువుల్లో ఉన్న ద్రాక్షాసవ ప్రాంతాలలోని శరత్సాయంకాల కాంతులు లండన్ నగరాన్ని ఆవరించిన పొగమంచు తెరలను చెదరగొట్టడానికి దండెత్తి వస్తున్నవి. న్యాయవాది మనస్సు కరిగిపోతున్నది. ఏ అత్యల్పంశామో తప్ప తన రహస్యాలల్లో అధికభాగాన్ని చెప్పుకోటానికి అట్టర్సన్క మిస్టరు గెస్టు తప్ప మరెవ్వరూ లేరు. అతడికి తెలియనివ్వకుండా ఎన్నో రహస్యాలను అతడు దాచిపెడదామనుకున్నా అతడు దాచిపెట్టలేడు. గెస్టు ఏవేవో వ్యవహారాలమీద డాక్టర్ జెకిల్ దగ్గరికి ఎన్నోమార్లు వెళ్లాడు. పూల్ అతన్ని బాగా ఎరుగుకూడాను. డాక్టర్ జెకిల్ ఇంట్లో హైడ్కు అతిపరిచయం ఉన్నదన్న విషయంకూడా అతడికి తెలుసును. ఇటువంటి స్థితిలో మిస్టర్ గెస్టు అగమ్యగోచరంగా ఉన్న ఈ లేఖను చూస్తే మంచిది, కాదా అన్న ఊహ అట్టర్సనక్కు తోచింది. అదీకాక అతడు చేతివ్రాతను చూడడంలో అధికకృషి చేసినవాడు దొడ్డగా పరామర్శించి నిర్ణయించగలడు. అతడు అట్టర్సన్ కు కేవలం గుమాస్తా మాత్రమే కాదు బాగా ఆలోచించి మంచి సలహాలను కూడా ఇవ్వగల సమర్థుడు. అతడు ఈ లేఖాపత్రాన్ని తిలకించిన తరువాత ఏదో ఒక అభిప్రాయాన్ని ఇవ్వకుండా ఊరుకొనేవాడు కాడు. అతడు అన్న మాటలను బట్టి అట్టర్సన్ భవిష్యత్కార్యక్రమాన్ని నిర్ణయించుకోవచ్చు. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 495