“మంచిది. ఆ విషయం నేనే ఆలోచిస్తాను" అన్నాడు న్యాయవాది. అయితే మీ విల్లునామాలో ఉన్న 'అదృశ్యత'కు సంబంధించిన విషయాలను మీకు పాఠం చెప్పి వ్రాయించింది ఆ హైడేనా?” అని న్యాయవాది ప్రశ్నిస్తే, దానికి డాక్టరు మూర్ఛాభ్రాంతిలో మునిగిపోయినట్లైనాడు. తెప్పరిల్లి నోరు గట్టిగా మూసుకొని ఔనన్నట్లు తల ఊపాడు. “అది నాకు తెలుసు. వాడు మిమ్మల్ని హత్య చెయ్యాలని ఉద్దేశించాడు అయితే మీరు చాలా చక్కగా తప్పించుకొన్నారు.” కొంత ప్రశాంతంగా అన్నాడు డాక్టరు "అంతే కాదు, ఇంతకంటే ఎంతో విశేషమైన మేలు చేకూరింది. ఓ ప్రభూ, నేను మంచి గుణపాఠం నేర్చుకొన్నాను.” ఈ మాటలు చెపుతూ ఉన్నప్పుడు అతడు తన ముఖాన్ని క్షణకాలం చేతుల్తో కప్పుకొన్నాడు. తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు న్యాయవాది పూల్తో ఒకటిరెండు మాటలు మాట్లాడాడు. “సరేగాని, ఇవాళ ఎవరో ఒక ఉత్తరం అందజేశాడట! అది తెచ్చిన మనిషి ఎలా ఉన్నాడు?" అని ప్రశ్నించాడు. పోస్టు ద్వారా తప్ప ఇతరంగా ఉత్తరాలు ఏమీ రాలేదనీ అవైనా కేవలం ప్రకటనలు మాత్రమే అనీ పూల్ స్పష్టంగా నివేదించాడు. ఈ వార్తతో మళ్ళీ అనుమానాలు అట్టర్సన్ వెంటపడ్డవి. పరిశోధనాలయద్వారం గుండానే లేఖ వచ్చి ఉంటుంది. ఈ విషయంలో సంశయమేమీ లేదు. బహుశః వెనక ఉన్న గదిలోనే ఈ ఉత్తరం వ్రాయటం కూడా జరిగి ఉంటుంది. ఇది నిజమంటే విషయాన్నంతటినీ మరోరీతిగా పరిశీలించవలసి ఉంటుంది అంతేకాదు అతి జాగరూకతతో కూడా పరిశీలించవలసి ఉంటుంది. "పార్లమెంటు సభ్యుని ఘోరహత్య ప్రత్యేకసంచిక!!" అని వార్తాపత్రిక లమ్మే కుర్రవాళ్లు అతడు వెళ్ళుతున్న వీథికి ఇరుప్రక్కలా ఉన్న వేదికామార్గాల మీద గొంతు చినిగిపోయేటట్లు కేకలు వేస్తున్నారు. ఈ కేకలన్నీ అట్టర్సన్ కు అతని ఖాతాదారూ, మిత్రుడూ అయిన ఒక ప్రముఖవ్యక్తి అంత్యక్రియల్లోని ఉపన్యాసాలలాగా వినిపిస్తున్నవి. ఒకవంక ఈ అపకీర్యావర్తంలో మరొక మిత్రుని స్వచ్చమైన కీర్తిప్రతిష్ఠలు రూపు మాసిపోతున్నట్లు ఎన్నో ఊహలు అతనికి కలుగుతున్నవి. ఆ భయం అతనిలో అతిశయంగా చెలరేగుతున్నది. అతని కేదో ఆశారేఖలు ద్యోతకమయ్యే ఊహలు తడుతున్నవి. అతనిది కేవలం స్వయంగా ఊహించే ప్రకృతి ఆలోచనల విషయంలో అతడు ఎవరిమీదా ఆధారపడేవాడు కాడు. కానీ ఈ విషయంలో మాత్రం అతనికి 494 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/494
స్వరూపం