5. ఉత్తరం కథ మధ్యాహ్నంలో చాలాభాగం గడచిన తరువాత అట్టర్సన్ డాక్టరు జెకిల్ ఇంటికి వెళ్ళాడు. వెంటనే పూల్ అతణ్ని లోపలికి ప్రవేశపెట్టాడు. ప్రాచీన భోజనశాలల్లోనుంచీ నడిపించుకుంటూ ఒక నిర్జనమైన పెరట్లోకి తీసుకువెళ్ళాడు. ఆ ప్రదేశం ఒకానొకప్పుడు ఉద్యానవనంగా ఉండేది. అక్కడినుంచీ పూల్ అతన్ని ఒక భవనంలోకి తీసుకువెళ్ళాడు. దాన్ని జనం పరిశోధనశాల లేదా శల్యశోధనశాల అంటుండేవాళ్ళు. డాక్టరు జెకిల్ ఈ భవనాన్ని ప్రసిద్ధుడైన ఒక శస్త్ర వైద్యుడి వారసుల దగ్గరనుంచి కొన్నాడు. ఇతడికి శరీరశాస్త్ర నిర్మాణం మీదకంటే రసాయనిక శాస్త్రవిషయాలల్లో పరిశోధనాసక్తి విశేషం. అందువల్ల ఇతడు ఆ భవనంలోని పెరటిని ఉద్యానవనంగా మార్చాడు. తన మిత్రుడు జెకిల్ పరిశోధనశాలలో ఉండగా అట్టర్సన్ అతన్ని కలుసుకోటం ఇదే మొదటిసారి. కిటికీలు లేక చీకటికోణంగా ఉన్న ఆ ఇంటిని అట్టర్సన్ ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నాడు. ఆ మందిరాన్ని చూస్తున్నప్పుడు అతడు అసంతృప్తితో పరికిస్తున్నాడు. ఈ భవనం ఒకప్పుడు విద్యాసక్తి గల విద్యార్థుల గుంపుతో నిండి ఉండేది. ఇప్పుడు అది నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లుంది. బల్లలన్నీ పరిశోధనలకు ఉంచిన రసాయనిక ద్రవ్యాలతో నిండి ఉన్నాయి. బంగీలు కట్టడానికి ఉపయోగించే గడ్డితో నేలంతా నిండి ఉంది. రసాయనిక పదార్థాలు కరిగించే కొలిమిగుండా మంచును చీల్చుకొని మసక మసకగా వెలుతురు లోపల ప్రవేశిస్తున్నది. ఆ మందిరానికి మరో ప్రక్క మెట్లవరస ఉంది. వాటిమీద ఎర్రనిగుడ్డ పరచి ఉంది. ఆ మెట్లు మరొక ద్వారం దగ్గరికి తీసుకోపోతాయి. ఈ ద్వారం నుంచే అట్టర్సన్ డాక్టరు జెకిల్ మందిరంలో ప్రవేశించాడు. ప్రవేశించిన క్షణమే డాక్టరు జెకిల్ అత్యాప్యాయతతో అతడికి స్వాగతం చెప్పాడు. ఈ గది మిక్కిలి విశాలమైంది. ఈ గదిచుట్టూ గాజుఫలకాలు అమర్చబడి ఉన్నాయి. ఇందులో బల్లలు మొదలైన సామగ్రి విశేషంగా కనిపిస్తుంది. పెరటివైపునకున్న ఇనప ఊచల కిటికీలు మూడూ దుమ్ముపట్టి కన్పిస్తున్నాయి. ధావనిలో అగ్ని మండుతూ ఉంది. పొగమంచే దట్టంగా ఇంట్లోకి కూడా వచ్చి పడుతున్నది. పొగ గూటి అరలో దీపం ఒకటి వెలిగించి ఉంది. అగ్నిధావనికి ప్రక్కనే డాక్టరు జెకిల్ వెచ్చదనం కోసం కూర్చున్నాడు. అతడు చూడటానికి చాలా జబ్బుపడ్డట్లుగా కన్పిస్తున్నాడు. అతిథిగా తన ఇంటికి వచ్చిన డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 491
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/491
స్వరూపం