Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనిపించటంవల్ల, తోస్తున్నది. బల్ల సొరుగులకు తాళాలు తీసి తెరచివున్నాయి. అగ్నిధావనిలో చాలాపత్రాలను పడేసి దగ్ధం చేసినట్లు కాలి కరుళ్లు కట్టిన పొత్తులవల్ల తెలుస్తున్నది. ఆ కాలిన పొత్తులలో నుంచి ఇన్స్పెక్టర్ తగలపడకుండా మిగిలిపోయిన ఒక బ్యాంకు చెక్కు పుస్తకపు పూర్వార్ధభాగాన్ని బయటికి తీశాడు. విరిగిన చేతికర్రలో రెండో సగం తలుపు వెనకన పెట్టి ఉంటే కనిపించింది. ఇంతటితో ఇన్స్పెక్టర్ అనుమానం గట్టిపడ్డది. అది లభించినందుకు తాను ఆనందభరితుడనౌతున్నాని అతడు ప్రకటించాడు. హంతకుడి పేరుతో బ్యాంకు ఖాతాలో అనేక వేల పౌనులు నిల్వ ఉన్నట్లు దానివల్ల తెలియవచ్చింది. బ్యాంకుకు వెళ్లి విచారణ చెయ్యవచ్చుననే ఆశ కలిగింది. ఆ రక్షణశాఖాధికారికి పరిపూర్ణ సంతృప్తి కలిగింది. “ఇక నా మాట నమ్మండి. హంతకుడు నా చేత చిక్కినట్లే! అతడికి మతిపోయి ఉంటుంది. లేకపోతే ఈ విరిగిన కర్ర ముక్కను ఇక్కడ ఉంచిపోయేవాడు కాదు ఈ చెక్కు పుస్తకాన్ని ఇలా తగులబెట్టేవాడు కూడా కాడు. ప్రతి వ్యక్తికీ ధనంతోనే గదండీ జీవితం! మనం చెయ్యవలసింది ఇంతకంటే ఏమీలేదు. బ్యాంకుదగ్గర అతనికోసం కాచుకొని కూర్చుందాం. అతడు తెచ్చే చెక్కులను పట్టుకుందాం” అన్నాడు అతను అట్టర్సన్తో. "కాని ఈ చివరిపనిమాత్రం అనుకున్నంత తేలికైనది కాదు. మిస్టర్ హైడ్తో ముఖపరిచయం కలనాళ్ళే కొద్దిమంది. ఇందాకటి వృద్ధదాసిభర్త కూడా అతన్ని రెండేమార్లు చూచాడు. హైడ్ కుటుంబంవాళ్లంటూ ఎక్కడా ఎవరూ ఉన్నట్లు ఆచూకీ అయినా లేదు. అతడు తన రూపానికి ఒక్క ఛాయాచిత్రాన్ని కూడా తీయించుకోలేదు. ఇలా ఉంటాడని అతన్ని వర్ణించగల కొద్దిమందైనా అతన్ని నానారీతుల వర్ణిస్తున్నారు. ఎవరు ఏ రీతిగా వర్ణించినా అతడిలో ఇదమిత్థమని చెప్పటానికి వీలులేని ఒకవికారం ఉంది అన్న విషయంలో మాత్రం అందరిదీ ఒకటే అభిప్రాయం. 490 వావిలాల సోమయాజులు సాహిత్యం-3