Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చూచాడు. కవరును తీసికోవచ్చిన వ్యక్తివల్ల పరిస్థితిని గురించి ఆదుర్దాతోనైనా సాకల్యంగా విన్నాడు. "కళేబరాన్ని చూచేవరకు ఇదమిత్థ మని నేనేమీ చెప్పలేను” అని గంభీరంగా పెదవి విరిచి అన్నాడు. “ఇది చాలా ఘోరచర్యగా తోస్తున్నది. దయ ఉంచి నేను దుస్తులు ధరించేదాకా వేచి ఉండండి" అని అట్టర్సన్ వచ్చిన వ్యక్తిని అర్థించాడు. ఇంతసేపూ కన్పిస్తున్న తీక్షమైన ముఖంతోనే ఉదయభోజనం వేగంగా పూర్తిచేసుకొని పోలీసు స్టేషనుకు వెళ్లాడు. అప్పటికే కళేబరం అక్కడ చేరి ఉంది. అట్టర్సన్ ఆ శవం ఉన్న కక్ష్యలో ప్రవేశించిన వెంటనే తల పంకించాడు. “అవును. ఇతణ్ణి నేను గుర్తు పట్టగలిగాను. ఇది సర్ డాన్వర్స్ అని చెప్పటానికి నేనెంతో చింతిస్తున్నాను" అని అన్నాడు. ఈ మాటలు వినగానే రక్షణశాఖాధికారి ఆశ్చర్యపడ్డాడు. అన్నాడు: “ఏమిటి! మహాశయా! ఇటువంటిది సంభవమా?” మరుక్షణంలోనే అతని వృత్తికి సంబంధించిన సహజలక్షణాలైన ఉత్సాహం, ఆసక్తి కన్నుల్లో మెలగటం ప్రారంభించాయి. “అయితే, ఇది చాలాగొప్ప ఆందోళనను కల్పిస్తుంది తప్పదు ఆరాలు తీసి హంతకుణ్ణి పట్టుకోటంలో మీరు మాకు తప్పక సాయపడతారని భావిస్తున్నాను" అన్నాడు ఆ అధికారి. అతడు అట్టర్సనక్కు ఆ కన్య చెప్పినదంతా సంక్షేపంగా చెప్పి, విరిగిపోయి దొరికిన కర్రముక్కను కూడా చూపించాడు. ఆ అధికారి కన్యవల్ల విన్న కథంతా చెపుతున్నప్పుడు హైడ్ పేరు రాగానే అట్టర్సన్ ఒకమాటుగా జంకి కలవరపడ్డాడు. అయితే చేతికర్రలో దొరికిన తునకను చూపించి ముందుపెట్టినప్పుడు అతడు ఇక సందేహించలేక పోయినాడు. ఇప్పుడది విరిగి చెదిరిపోయి కనిపిస్తున్నా దాన్ని తాను కొన్నేళ్ళకు పూర్వం డాక్టరు జెకిల్కు బహూకరించిన చేతికర్రే అని సులువుగా అతడు గుర్తింపగలిగాడు. "ఆ హైడ్ గుజ్జు రూపం వాడేనా?" అని సాలోచనగా అట్టర్సన్ ప్రశ్నించాడు.. “చాలా పొట్టివాడట! అతిక్రూరపు చూపు కూడా కలవాడట! ఆ దాసీ కన్య చెప్పింది” అని సమాధానమిచ్చాడు అధికారి. అట్టర్సన్ ఆలోచనలోపడ్డాడు, కొంతసేపటికి తలెత్తి అధికారితో, "ఇప్పుడు మీరు నా బండిలో వెంటవస్తే నేను మీకు అతడి ఇల్లు చూపిస్తాను" అని అన్నాడు. అప్పటికి ఉదయం తొమ్మిది గంటలైంది. ఆ ఋతువులో మంచు కురియటం ఆరంభించి అదే మొదటిదినం. మంచు తెరలు ఆకాశాన్నంతా ఆవరించి ఉన్నాయి. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 487