4. క్యారూ హత్యావ్యవహారం ఒక సంవత్సరకాలం దరిదాపుగా గడిచిపోయింది. 18 అక్టోబరు మాసం. లండన్ మహానగరంలో ఒక దారుణమైన హత్య జరిగింది. నగరమంతా ఉడికిపోతున్నది. హతుడైన వ్యక్తి ఉన్నతస్థితిలో ఉన్నవాడు. ఆ కారణంవల్ల ఈ హత్యోదంతం విశేషప్రాముఖ్యాన్ని వహిస్తున్నది. తెలియ వచ్చిన హత్యావివరాలు చాలా స్వల్పంగా ఉన్నవి. ఆ కొద్ది వివరాలైనా మహాదారుణమైనవి. నదికి దగ్గరగా ఉన్న ఒక ఇంట్లో ఒక పడుచుదాసి ఒంటరిగా నివసిస్తున్నది. దరిదాపు రాత్రి పదిగంటలప్పుడు ఆమె నిద్ర పోవటానికని పై అంతస్తుమీదికి వెళ్ళింది. తెల్లవారుజామున పొగమంచు నగరాన్నంతటినీ ఆవరించినా రాత్రి ఆకాశం స్వచ్ఛంగా ఉంది. మబ్బు లేమీ లేవు. సంపూర్ణ చంద్రుని వెన్నెల్లో ఆ కన్యక ఉన్న ఇంటి వాతాయనం గల ఉపవీథి ప్రకాశిస్తున్నది. ఆ పడుచును గురించి కొంత విలాసప్రియ అని చెప్పుకుంటారు. కిటికీ క్రింద ఉన్న పెట్టెమీద కూర్చొని ఆమె ఏవేవో కలలు కంటూ ఉన్నది. రాత్రి జరిగిన సంఘటన గురించి కంటనీరు కారుస్తూ ఆ పిల్ల చెప్పింది. ఆ పిల్లకు ఆ నాటి రాత్రి మానవలోకం మీద కలిగినంత మక్కువ మరెన్నడూ కలుగలేదుట! ఆ నాడామె ప్రపంచంమీద వహించినంతటి కరుణభావాన్ని మరెప్పుడూ పొందలేదట! ఈ నాటి రాత్రి అలా కలలు గంటూ పెట్టెమీద కూర్చొని కిటికీగుండా క్రిందికి చూస్తుంటే వెండి జుత్తుతో అందగాడు, వయస్సు ముదిరినవాడు, ఆ సందులో ప్రవేశించి క్రమంగా దగ్గరికి వస్తున్నాడు. గుజ్జురూపంతో మరో వ్యక్తి కూడా ముందుకు చూస్తూ వస్తున్నాడు. మొదట ఆ కన్య రెండో వ్యక్తిని అంతగా గమనించలేదు. నిలిచి మాట్లాడటానికి వీలైనంత దగ్గరగా వాళ్ళిద్దరూ కలుసుకొన్నప్పుడు, సరిగా ఆ కన్నెకు కళ్ళముందు కనిపించే స్థలం, ఇద్దరిలో వృద్ధుడు రెండో వ్యక్తికి వంగి నమస్కరించి ఎంతో హుందా అయిన రమణీయరీతితో వినయభావాన్ని ప్రకటించి ముఖం వంక చూచాడు. అతడు అడిగినదానిలో గూడా ఏమీ విశేషమున్నట్లు కన్పించదు. అతడు చేయి చాపి చూపించటాన్ని బట్టి ఏదో త్రోవ అడిగినట్లుగా అర్థమౌతున్నది. అతడు మాట్లాడుతున్నప్పుడు వెన్నెల వెలుగు అని ముఖంమీద పడ్డది. అప్పుడు అతని ముఖాన్ని పరికించి చూడటానికి ఆ కన్నె ఎంతో ముచ్చట పడ్డది. ఆ ముఖంలో ఒక డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 485
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/485
స్వరూపం