ఈ పుటను అచ్చుదిద్దలేదు
డాక్టర్ జెకిల్ అట్టర్సన్ భుజంమీద చేయి వేసి తడుతూ, “మిమ్మల్ని నటించమని నేనెన్నడూ కోరను. అయితే ఏది న్యాయమో దాన్ని అనుసరించమని కోరుతాను. నా అనంతరం నా కోసం అతడికి సాయం చెయ్యవలసిందని మిమ్మల్ని అర్థిస్తున్నాను” అన్నాడు. అట్టర్సన్ అణచుకోలేని నిట్టూర్పు విడిచాడు. అన్నాడు: “మంచిది. ఇదిగో, అలాగే మీకు వాగ్దానమిస్తున్నాను.” 484 వావిలాల సోమయాజులు సాహిత్యం-3