తప్పించుకొన్నందుకు తన యెడ తానే కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకొన్నాడు. మళ్ళీ అతని మనస్సు మొదటినుంచీ ఆలోచిస్తున్న విషయంమీదికి ప్రసరించింది. ఆశారేఖ ఏదో హఠాత్తుగా అతనికి గోచరించింది. << “యువకుడైన ఈ హైడ్ను పరిశీలించి చూస్తే, అతని జీవితానికి సంబంధించిన కొన్ని మర్మాలు తప్పక బయటపడి తీరుతాయి. అతని జీవితంలో చాలా గూఢరహస్యాలున్నట్లు వాడి చూపే వ్యక్తం చేస్తున్నది. దుష్టాతిదుష్టాలైన ఈతని జీవితరహస్యాలతో వెర్రి జెకిల్ రహస్యాలను పోల్చి చూస్తే, రెండోవి పగటి వెలుగులా స్వచ్ఛంగా కన్పించి తీరుతాయి. ఇలా ఎంతో కాలం జరగదు. వీడు దొంగలా హారీ శయ్య దగ్గిరికి నక్కుతూ వెళ్ళటాన్ని తలుచుకొంటుంటే నా ఒళ్లు చల్లబడిపోతున్నది. ఎంతటి ప్రమాదముందో గమనించావా? ఈ హైడ్కు వీలునామా అంటూ ఒకటి ఉన్నదని తెలిస్తే, దాన్ని స్వాధీనం చేసుకొని ఆస్తినంతటినీ భుక్తంలోకి తెచ్చుకోటానికి ఎంతో అతురత వహిస్తాడు. జెకిల్ నాకు అవకాశమిస్తే ఈ విషయంలో నేను గట్టిగా పూనుకొని తీరుతాను. జెకిల్ గనక నాకు అవకాశమిస్తేనా?..." అని తనలో తాను తర్కవితర్కాలు చేసుకొంటూ నడుస్తున్నప్పుడు, జెకిల్ ఇచ్ఛాపత్రంలోని ఎన్నో అంశాలు అతని మనోనయనాలముందు ముకురంలో ప్రతిబింబించినట్లు విస్పష్టరూపంతో కన్పిస్తున్నవి. 480 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/480
స్వరూపం