Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"అవునండి. వారికి అతనిమీద గట్టి నమ్మకముంది. మమ్మల్ని అందరినీ మిస్టర్ హైడ్ ఆజ్ఞానుసారంగా ప్రవర్తించండి అని ఆజ్ఞాపించారు కూడాను" అన్నాడు పూల్. "మిస్టర్ హైడ్ను కలుసుకొనే అదృష్టం నాకెప్పుడూ పట్టలేదని అనుకుంటాను” అన్నాడు అట్టర్సన్ "లేదు బాబూ! ఆయన ఎన్నడూ ఇక్కడ భోజనం చెయ్యడు" అన్నాడు పూల్. "అంతేకాదు, భవనంలోని ఈ భాగానికి వారు ఎప్పుడూ రారు కూడాను. పరిశోధన మందిరంలోకి సూటిగా వస్తుంటారు, వెళ్తుంటారు” అని పూల్ చెప్పాడు. "మంచిది. పూల్! వస్తాను. శుభం!" “నమస్తే, మిస్టర్ అట్టర్సన్!?” బరువు గుండెతో న్యాయవాది ఇంటిదారి పట్టాడు. తనలో తాను ఇలా అనుకుంటూ నడుస్తున్నాడు. "వెర్రివాడు పాపం! హారీ జెకిల్! అతడు నడిసముద్రంలో ఉన్నాడని పిస్తుంది. చిన్నప్పుడు అతిస్వేచ్ఛగా ప్రవర్తించినవాడు. ఇది ఏ నాటి మాటో! భగవచ్ఛ! దానికి హద్దుపద్దులంటూ ఉండవు. విషయం అదే ఐఉంటుంది. పూర్వం చేసుకొన్న పాపం భూతరూపాన్ని ధరించి అతన్ని ఆవహించి ఉంటుంది. రహస్యంగా దాచిపెట్టిన రాచపుండు అతన్ని పట్టేసింది. ఏ పనికైనా ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. ఈ నాడు అనుభవిస్తున్నాడు. ఆత్మమీద అభిమానం వల్ల ఎన్నో ఏళ్ళక్రింద చేసిన అపచారం జ్ఞప్తికి ఉండకపోవచ్చు. అయితేనేం? శిక్ష అనుభవిస్తున్నాడు.” ఇలా ఏమేమో భావిస్తూ అట్టర్సన్ నడుస్తున్నాడు. ఈ రీతిగా ఊహిస్తున్నప్పుడు తన్ను గురించిన భయం ఏదో అతనిలో తారట్లాడింది. తన పూర్వప్రవర్తనను కూడా పరిశీలించటం మొదలు పెట్టాడు. ఎన్నాళ్ళనాటివో అతని చేష్టలన్నీ మనస్సులో ఒక మాటు దర్శనమిచ్చి వెళ్ళిపోతున్నాయి. ఏదైనా జ్ఞప్తి లేని అపచారపిశాచం తన్ను ఆవరించిందేమోనని శోధించుకొన్నాడు. అది పూర్తయింది. అమ్మయ్య! అతని పూర్వచరిత్ర అంతా నిష్కల్మషంగానే ఉంది. ఇలా తమ పూర్వచరిత్రను మాధ్యస్థం వహించి పరిశోధించుకోగల వ్యక్తులు లోకంలో ఎందరో లేరు తన చరిత్ర అతిపరిశుద్ధమైందని నిరూపితమైనా, తన స్వల్పదుష్కృత్యాలకే అతడు భయంతో క్రుంగిపోతున్నాడు. తాను చేయటానికి తలపెట్టి తీరా సర్వంసిద్ధం చేసి మానుకొన్న పనులు జ్ఞప్తికి వచ్చినప్పుడు, వాటిని చెయ్యకుండా డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 479