Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆకర్షించి అరికట్టేస్తున్నది. ఎందుకో అతనికి ఈ నాడు ఇన్నాళ్ళునుంచీ తాను చేస్తున్న కృషి ఫలిస్తుందన్న గాఢవిశ్వాసం కలిగింది. వెంటనే అతడు మెల్లగా ఆ ఇంటి పెరటిలోకి నడిచివెళ్ళాడు. ఆ అడుగులు వేగంగా దగ్గిరికి వస్తున్నాయి. వీథిమలుపు తిరిగేటప్పటికి వాటి చప్పుడు హఠాత్తుగా హెచ్చింది. ఇంతకు పూర్వమే ఆ వచ్చే వ్యక్తిని న్యాయవాది అట్టర్సన్ ద్వారతోరణం దగ్గర నిలిచి చూడటం వల్ల, తాను భవిష్యత్తులో ఎటువంటి వ్యక్తితో వ్యవహరించవలసి ఉందో అతన్ని బాగా గమనించగలిగాడు. అతడు మిక్కిలి పొట్టివాడు. సాదా దుస్తులు ధరించాడు. అతడి చూపు అంతదూరాన ఉన్నప్పుడే చూచేవాళ్ళ ఆసక్తిని చంపేస్తున్నది. వచ్చే వ్యక్తి కాలహరణం కాకుండా ఉండటానికి వీధికి అడ్డంపడి ద్వారబంధం దగ్గిరికి సూటిగా వచ్చాడు. తన ఇంటికి వచ్చిన యజమానిలా జేబులోనుంచి తాళం చెవిని బయటికి తీశాడు. అట్టర్సన్ రెండు అడుగులు ముందుకువేసి లోపలికి ప్రవేశించబోతున్న ఆ వ్యక్తి భుజం తట్టి "మీరు మిస్టరు హైడ్ అనుకుంటాను?" అన్నాడు. హైడ్ కొంచెంగా వెనక్కు తగ్గి ఒకమాటు దీర్ఘంగా నిశ్వసించాడు. అయితే అతడికి కలిగిన భయం క్షణకాలం కంటే నిలువలేదు. ప్రశాంతంగా, న్యాయవాదిని ముఖంలోకి చూడకుండానే, "అవును. అది నా పేరే. మీకేం కావాలి?" అని ప్రశ్నించాడు. “మీరు లోపలికి వెళ్ళుతున్నారనుకుంటాను” అని “నేను డాక్టర్ జెకిల్కు చిరకాలమిత్రుణ్ణి. గాంట్ వీథిలో నివసించే అట్టర్సన్ ను నేనే. మీరు బహుశః నా పేరు వినే ఉంటారు. ఇప్పుడు మనం చాలా తీరికగా కలుసుకున్నాం. కనుక లోపలికి రావటానికి అనుజ్ఞ ఇస్తారా?” "డాక్టర్ జెకిల్ మీకు కన్పించడు. అతడు ఇంట్లోనుంచి వెళ్లాడు" అని తాళం చెవి ఊదుతూ సమాధానం చెప్పాడు. అంతటితో ఊరుకోలేదు. "నేను మీకెట్లా తెలుసు?” అని చివాలున ఇంకా తల ఎత్తుకుండానే ప్రశ్నించాడు. అప్పుడు అట్టర్సన్ ఇలా అన్నాడు "మీరు ఇప్పుడు నాకొక సాయం చేయగలరా?" "మహానందం. ఏమిటది?" అన్నాడు హైడ్. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 475