Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(మీరేమన్నా అనండి) విచిత్రమైన బానిస ఎందుకైనాడో, తన ఇచ్ఛాపత్రంలో ఉన్న విపరీతనిబంధనలు ఎందుకు వ్రాయవలసి వచ్చిందో అతన్ని ఒక్కమాటు చూస్తే అర్థమైపోతుందని అతడు నిశ్చయించాడు. దాక్షిణ్యకోశమంటూ లేని ఆ వ్యక్తి ముఖం అందుకోసమైనా చూడదగ్గంత విలువ గలది. అంతేకాదు త్వరగా చలించని ఎన్ఫీల్డ్ మనస్సులో తిరుగులేని ఏహ్యభావాన్ని కలిగించగలిగి నందుకైనా అతని ముఖం చూడదగ్గది. చూడాలెనని కోరిక కలిగినప్పటినుంచీ అతడు ఆ ఉపవీథిలో ఉన్న గృహద్వారం దగ్గిరికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. ఉదయం తన కార్యాలయానికి వెళ్ళే సమయానికి పూర్వం, మధ్యాహ్నం వ్యవహారాలభారం విశేషంగా ఉండి కాలం స్వల్పంగా ఉన్నప్పుడూ, రాత్రి పొగమంచు కప్పిన నగరచంద్రుని వెన్నెల వెలుగుల్లో, దీపాలు వెలుగుతూ సమ్మర్దం ఉన్నప్పుడూ, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు - ఏకాంతస్థితి చిక్కినా, ఊపిరి సలుపుకోలేని పనులున్నా - తాను మనఃపూర్వకంగా ఎన్నుకున్న ఈ పనిమీద ఆ ప్రదేశానికి వెళ్ళివస్తున్నాడు. "అతడు మిస్టర్ హైడ్ అయితే నేను మిస్టర్ సీక్ నౌతాను! అన్వేషించి తీరుతాను” అని నిర్ణయించుకున్నాడు. చివరకు అతని శ్రమ ఫలించింది. అది ఒకనాటి రాత్రి దట్టంగా మంచు పట్టి ఉంది. వీధులన్నీ బ్యాలెట్ నిత్యమందిరంలోని నేలల్లా పరిశుభ్రంగా ఉన్నాయి. గాలి తూలుతూ ఒక పథకం వేసుకొని వెలుగునీడలను సృజిస్తున్నట్లుగా దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. షాపులన్నీ మూసిన తరువాత పది గంటల ప్రాంతంలో ఆ ఉపవీథి నిర్జనంగా ఉంది. లండన్ నగరఘోష నీరసించి సన్నని మూల్గులు వినిపిస్తున్నది. అది అతినిశ్శబ్దంగా ఉంది. ఎంత చిన్న శబ్దమైనా బహుదూరం వినిపిస్తున్నది. గృహకృత్య నిర్వహణలో కలిగే ధ్వనులు వీథికి రెండువైపులా ఉన్న ఇళ్ళల్లో నుంచి వినిపిస్తున్నవి. ఎవరైనా ఆ వీథిని వస్తుంటే ఆ వ్యక్తి దర్శనానికి ఎంతో ముందుగానే కాలిచప్పుళ్ళు వినిపిస్తాయి. తన పని మీద అట్టర్సన్ ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత కొన్ని నిమిషాల కాలం గడిచింది. ఇంలో అతడికి, వింతగా తేలిగ్గా వస్తున్న కాలిచప్పుళ్ళు విన్పిస్తూ ఉన్నవి. బహుకాలం నుంచీ మాటు వేసుకొని రాత్రులు గస్తీ తిరుగుతున్న అతడికి, ఒంటరిగా వచ్చే మనిషి కాలిచప్పుడు, అతడు ఎంత దూరాన ఉన్నా, నగరఘోషలోనుంచి విడివడి అమాంతంగా విస్పష్టంగా వినిపించటం మిక్కిలి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కాలిచప్పుడు అతన్ని అతిదారుణంగా 474 వావిలాల సోమయాజులు సాహిత్యం-3