అతనికి ఏదో అంధకారంగా ఉంది. ఏవేవో ప్రశ్నలు. ప్రశాంతి అణుమాత్రం లేకుండా గడిచిపోయింది. అట్టర్సన్ ఇంటికి చాలా దగ్గరగా ఉన్న చర్చిలోంచి గంటలు ఆరు వినిపించాయి. ఆ సమస్యను ఇంకా అతడు త్రవ్వి తిరగవేస్తూనే ఉన్నాడు. అతడు ఇంతరవకూ ఆ సమస్యను వ్యవహారదృష్టితోనే పరిశీలించాడు. ఇప్పుడు అది అతని ఊహాశక్తి నంతటినీ ఆకర్షించి బానిసగా చేసుకొన్నది. తెరవేసిన అతని గదిలో ఆ సమస్య ఆడుతున్న చిత్రంలాగా కళ్ళముందు కనిపించటం ప్రారంభించింది. ఎన్ఫీల్డ్ చెప్పిన కథంతా దృశ్యం తరువాత దృశ్యంగా అతని నేత్రాలముందు నడిచింది. ఆ నిశీథినగరంలో దీపాలవరస, అతివేగంగా నడిచివస్తున్న వ్యక్తి మూర్తి, డాక్టరు ఇంటిముందుగా పరుగెత్తుకుంటూ పోతూ ఉన్న బాలిక, వాళ్ళిద్దరూ తారసిల్లటం, పిల్ల పడిపోవటం, ఆ పిల్లమీదుగా ఆ వ్యక్తి పిసరు వెళ్ళేటట్లు జగన్నాథరథంలా నడవటం, ఆ పిల్ల మూల్గులనైనా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉండడం - అన్నీ క్రమరీతిని కనిపించాయి. ఇది కాకపోతే ఒక దొడ్డ సౌధంలో తన మిత్రుడు కలలు కంటూ ఉండటం, లేదా కలల్లో కలకల నవ్వుతూ ఉండటం, ఇంతలో ఒక వ్యక్తి అతని శయ్యాకక్ష్యలో తలుపులు తెరుచుకొని ప్రవేశించి ఎట్ట ఎదుట నిలువబడటం, అటువంటి అర్ధరాత్రి సమయంలో తన మిత్రుడు వచ్చిన వ్యక్తి ఆజ్ఞలను అతివిధేయతతో పాటించటం - అన్నీ కళ్ళముందు వరుసగా ఆడుతున్నట్లు కన్పించాయి. ఈ రెండు సంఘటనల్లోని వ్యక్తులూ రాత్రంతా న్యాయవాదిని వెన్నాడుతూనే ఉన్నారు. ఒకవేళ ఏ క్షణకాలమో మధ్యలో కునికిపాట్లు పడ్డా ఆ నిద్రమత్తులో కూడా నిద్రాముద్రితాలైన ఆ సౌధవ్యూహా పరంపరలలో ఆ వ్యక్తి అణువేగంగా మసలుతూ కన్పించాడు. ఆ మహానగర వీథుల్లో ఏ సంఘటన తోచినా బాలికను భయంకరంగా కాళ్ళతో త్రొక్కుతూ మూల్గులను కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తే కన్పించాడు. అతడు ఎవరో గుర్తిద్దామంటే అతనికి ముఖం లేదో! స్వప్నావస్థలో కూడా అతడికి ముఖం ఉండి కన్పించదో!! క్షణకాలం కన్పించి కళ్ళముందు కరిగిపోతుందో!! ఇటువంటి స్థితిలోనే హైడ్ సత్యస్వరూపం ఎటువంటిదో చూచి తీరాలెనని అట్టర్సనక్కు ఒక విశిష్టమైన కోరిక జన్మించి, క్రమంగా గాఢం కాజొచ్చింది. సమస్తమైన విచిత్రవిషయాలూ పరిశీలించిన తరువాత అర్థం కావటం సహజం. కనుక తాను ఒక్క మారు కళ్ళతో అతన్ని చూస్తే ఈ విచిత్రకథంతా బోధపడుతుందని ఊహించాడు తన మిత్రుడికి అతడిమీద అంతటి గాఢాభిమానం ఎందుకో, అతడికి డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 473
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/473
స్వరూపం