Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిచ్చాపాటి కొంత సాగింది. తరువాత న్యాయవాది తన మనస్సును అమితంగా కలవరపెడుతూ ఉన్న విషయాన్ని సంభాషణలోకి తీసుకోవచ్చాడు. "లాన్యన్! హెన్రీ జెకిల్కు ఉన్న చిరకాలవృద్ధమిత్రులం మన మిద్దరమే అయి ఉండాలి అని అనుకుంటున్నాను. మీరేమంటారు?” అని అతన్ని అడిగాడు. "ఆ మిత్రులు యువకులైతే బాగుంటుందని నా కోరిక" అని లాన్యస్ అదో రీతిగా నవ్వాడు. "అవును. అతని వృద్ధమిత్రులం మన మిద్దరమే అయితే ఇప్పుడు ఏమి వచ్చింది? అతడు వెనకటిలా కన్పించటం లేదే!" అన్నాడు లాన్యన్. “నిజంగానా? మీ ఇద్దరికీ నిత్యసాంగత్యం ఉంటున్నదనుకొంటున్నానే!" అన్నాడు అట్టర్సన్. “అది నిజమే. ఒకప్పుడు మా ఇద్దరికీ అటువంటి అనుబంధమే ఉంటూ ఉండేది. అయితే హెన్రీ జెకిల్ నాతో ఖుషీగా మాట్లాడి పదేండ్లకు పైబడ్డది. అతడి మనస్సు చెడుత్రోవలు పట్టటం మొదలుపెట్టిన తరువాత కూడా కొంతకాలం, నేను అతడంటే ఎంతో ఉత్సాహాన్ని చూపుతూనే వచ్చాను. అతని రాక్షసత్వాన్ని క్రమంగా గమనించాను” అంటూ సంభాషిస్తున్నప్పుడు హఠాత్తుగా ఆ వైద్యుడి ముఖం ఎర్రవారింది. అన్నాడు

"అటువంటి అశాస్త్రీయ లక్షణాలమీద బుద్ధి నడుస్తుంటే డామన్ పిథియన్ల వంటి

మిత్రులు కూడా శత్రువులు కాకతప్పదు!" అతడిలో ఇటువంటి ఉద్రేకం కలగటం వల్ల అట్టర్సనక్కు తన శ్రమలో కొంత తీరినట్లు తోచింది. వైద్యశాస్త్ర విషయకంగా వారిద్దరికీ అభిప్రాయభేదా లేవైనా కలిగాయేమో అనుకున్నాడు. కానీ ఆస్తిపరివర్తనకు సంబంధించిన విషయంలో తప్ప మరే ఇతర శాస్త్రీయాంశాల్లోనూ తనకు ఆసక్తి లేకపోవటం వల్ల, అతడు "ఇంతకంటే అప్రశస్తం ఇంకేముంటుంది?" అన్నాడు. ఈ మాట వినగానే డాక్టరు విస్తుబోయాడు. స్వస్థితికి రావటానికి రెండు సెకన్ల కాలమిచ్చి అట్టర్సన్ తిరిగి తన ప్రసంగం సాగించాడు. అన్నాడు :"అతడి రక్షణలో ఉన్న హైడ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా?” "నేను జీవించిన ఇంతకాలంలోనూ అతన్ని గురించి వినను కూడా లేదు.” న్యాయవాదికి ఇంతమాత్రం విషయం దొరికింది. దానితో అతడు తిరిగీ తన ఇంటికి వెళ్ళి, ఉదయమయ్యేటంతవరకూ తన ప్రక్కమీదనే అటూ ఇటూ పొర్లాడు. అసలే అతనిది విశేషశ్రమవల్ల ఎప్పుడూ అలిసిపోయి ఉండే మనస్సు. క్రితం రాత్రంతా 472 వావిలాల సోమయాజులు సాహిత్యం-3