Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూడా ఉంది. వారం రోజులనాడు దాన్ని తిరిగీ అతడు ఉపయోగిస్తుండగా మళ్ళీ నేను చూచాను" అని మందకొడిగా సమాధానం చెప్పాడు ఎన్ఫీల్డ్. మిస్టర్ అట్టర్సన్ దీర్ఘంగా నిశ్వసించాడు కానీ ఏమీ మాట్లాడలేదు. యువకుడు ఎన్ఫీల్డ్ మళ్ళీ అందుకున్నాడు. అన్నాడు: "ఈ సందర్భంలో నేను తిరిగి ఒక గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. అది ఏమీ చెప్పకుండా ఉండటం. ఇందాకటినుంచీ నేను చూపిన వాచాలతను తలుచుకుంటుంటే నాకే సిగ్గు వేస్తున్నది. మనం ఒక ఒప్పందానికి వద్దాం. ఈ విషయం మనం ఎన్నడూ తిరిగి ప్రస్తావన చెయ్యవద్దు” "హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. రిచ్చర్డ్! ఇదిగో, నేను ఒడబడ్డట్లు అంగీకారసూచకంగా నా హస్తాన్ని అందిస్తున్నాను” అన్నాడు న్యాయవాది అట్టర్సన్. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 469