Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"మీరు ఇంతటితో ఈ కథ పూర్తయిందని అనుకోవద్దు. మరో విచిత్రవిషయం కూడా జరిగింది. మొదట చూచినప్పుడు ఆ వ్యక్తిమీద రోత పుట్టింది అతన్ని చూచి ఆ పిల్ల బంధువులు కూడా అలాగే అసహ్యించుకున్నారు. ఇది సహజమేగా! అక్కడికి వచ్చిన డాక్టరు లక్షణం నాకు అతివిచిత్రంగా తోచింది. అతడు సామాన్యంగా పెళు సుగా ముక్తసరిసంభాషణ చేసే వైద్యుడు. అతని కంఠస్వరంలో ఎడింబరో మాండలి కోచ్చారణ గాఢంగా కనిపిస్తున్నది. ఆవేశం వచ్చినప్పుడు అతడు సంగీతపుతిత్తిలా ఉబ్బిపోయి కన్పించాడు. అతడు కూడా మావలెనే అక్కడ ఉండిపోయాడు. నాకు బందీగా చిక్కిపోయిన వ్యక్తివైపు అతడు చూచినప్పుడల్లా 'సాబోన్లు' అతన్ని హత్య చేద్దామన్నంతగా తబ్బిబ్బుకావటం జరిగింది. అతడి మనస్సులో ఏముందీ నాకు అర్థమైపోయింది నా మనస్సులో ఏముందీ అతడికి తెలిసింది! హత్య చేయటమన్న ప్రశ్నకు ఎటువంటి ఆస్కారమూ లేదు. కాబట్టి తరువాతి చేయదగ్గ మంచిపని ఏదో అది, - చేసిన పనికి నలుగురిలో తలెత్తి తిరగలేకుండా ఏమి చెయ్యాలో అది చేశాం. అతడిమీద నిందమోపి లండన్ నలుమూలలా ప్రకటించేస్తామని అతడితో స్పష్టంగా చెప్పేశాము. నగరంలో అతడికి మిత్రులు గానీ, పరపతిగానీ ఉంటే ఇక వదులుకోవలసిందే అని అతన్ని బెదిరించాము. కర్రకాల్చి వాతలు పెడుతున్నట్లుగా ఈ మాటలు మేము మాట్లాడుతున్నంత సేపూ, శివాలెత్తిన పెనుభూతాలు గనుక, ఆడవాళ్లను అతడి దగ్గిరికి చేతనైనంతవరకూ రాకుండా చూచాం. కోపోద్రేకం వల్ల అలా ఎర్రవారిన ముఖాలను నేను మళ్ళీ ఎన్నడూ చూడలేదు. - జనమధ్యంలో ఉన్న ఆ ఖైదీ పెద్దమనిషి నల్లగా కొరివిలా వికటహాసం చేస్తూ ఉన్నాడు. అది నేను గమనించాను. అతడు సైతానులా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అన్నాడు: “ప్రమాదవశాన జరిగిన దానికి మీరందరూ ఇంత చేయదలుచుకుంటే, నిస్సహాయుణ్ణి నేనేం చేయగలను?" అని. మేమడిగాము నెమ్మదిగా అతన్ని నూరుపౌనులు ఇస్తా ననేటంత వరకూ తెచ్చాము. ఎలాగైనా ఇటువంటి చిక్కుల్లో పడకుండా తప్పించుకొందామని అతడు ప్రయత్నించేవాడే. కానీ మేమందరం చాలా పట్టుదలగా ఉన్నాం. అందువల్ల ఆ ఆటలు సాగవని గమనించి చివరకు ఒప్పుకున్నాడు. ఇక కర్తవ్యం. ఈ వంద పౌనులనూ వసూలు చేయటం. అతడు మమ్మల్ని ఎక్కడికి తీసుకోపోయినాడో తెలుసా? ఈ ద్వారబంధం దగ్గిరికే తీసుకువచ్చాడు. జేబులోపలినుంచి ఒక తాళం చెవి తీసి లోపలికివెళ్ళి వెంటనే ఏబది పౌనుల విలువచేసే బంగారాన్నీ, చూపించినవారికి ఏబది పౌనులు డబ్బిచ్చేటట్లు కూట్సు బ్యాంక్కి వ్రాసిన ఒక చెక్కూ తెచ్చి మాకిచ్చాడు. ఆ చెక్కు మీద చేసిన సంతకం నిజమైనదైతే ఒక డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 465