55. గోకరాళ్ళ కూతలు : రోమనులు పక్షుల కలకలాలను బట్టి, విహరించే రీతులను బట్టి ఎన్నో విషయాలను తెలుసుకొంటూండేవారు. ఈ అంశాలవల్ల తన హత్యాదోషం బయటపడ్డదన్న భావం మేక్బెత్కు కలిగినట్లు స్పష్టమౌతున్నది. 56. చంద్రశృంగంమీది నిబిడమైన బిందువు: ప్రాచీనకాలంలో చంద్రగోళం నుంచి కొన్ని రసబిందువులు ఔషధులమీద పడి వాటికి విచిత్రమైన మాంత్రికశక్తి నిచ్చేవనే విశ్వాసముండేది. 57. ఉదాత్తుడైన డంకన్ ను గురించి డంకన క్కు ఉదాత్తుడన్న విశేషణం సర్వసాధారణంగా ప్రయోజితమైంది. చరిత్రాత్మకంగా డంకన్ అటువంటివాడు కాకపోయినా, షేక్స్పియర్ అతణ్ణి అటువంటివాడినిగా చిత్రించటం, రాజ్యాపహర్త, హంతకుడు ఐన మేక్బెత్ పతనాన్ని తీవ్రతరం చేయటంకోసమేనని గమనించవలసి ఉంది. 58. పవిత్రుడైన ఎడ్వర్టు రాజు : ఈ ఎడ్వర్టు రాజుకు పోపు అలెగ్జాండర్ III 'కన్ఫెసర్' అన్న బిరుదునిచ్చి, 1161లో గౌరవించాడు. వెస్ట్ మినిస్టర్ అబీని (మఠాలయాన్ని) నిర్మించినదీ మహారాజే. 59. హత్యాఖడ్గ ప్రదర్శనలు లేకుండా : ఇది అనుమానించదగ్గ నానారీతులైన వారితో కలిసి విందులను సేవించేటప్పుడు బల్లలమీద ఛురికా ఖడ్గాలను గ్రుచ్చటమనే పూర్వపు స్కాట్లండు దేశాచారాన్ని జ్ఞప్తి చేస్తున్నది. 60. మాక్డఫ్ కోసం వార్త పంపించలేదా? - మాక్డఫ్ ఫైఫ్ దుర్గాధిపతి. ఫైఫ్ మేక్బెత్ ప్రస్తుతమున్న ఫొర్రెస్ సౌధానికి రోజు ప్రయాణం కంటే ఎక్కువ దూరంగా ఉంది. కానీ షేక్స్పియర్ ఒక రోజులోనే వార్తాహరి వెళ్లి తిరిగి రాదగినంత దూరంలో ఉన్నట్లు ఊహించాడు. చతుర్థాంకం 61. చారలపిల్లి : ప్రథమ మాంత్రికురాలి పిల్లి - గ్రేమాల్కిన్. 62. మూడున్నొక్కమారు: మంత్రగత్తెలకు మూడు, ఒకటి ముఖ్యంగా శక్తియుతమైన సంఖ్యలు. 63. జ్యూజాతివాని : షేక్స్పియర్ జ్యూ, టర్క్, తాత్తారులనందరినీ ఒకేలెక్కలో 456 పరిగణించటం, వారిని జంతువులతో సమానంగా చూడటం, అతని కాలంవారికి వారిమీద ఎట్టి అభిప్రాయమున్నదీ వ్యక్తం చేస్తున్నది. చంగినాఖాన్ వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/456
స్వరూపం