Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వభావంగల ఒక ఛాయ! జగదంగంమీద గడియో అరగడియో నిక్కుతూ, నురగలు క్రక్కుతూ ఆ కాస్త కాలం గడచిందో, మళ్ళీ మాటైనా వినబడకుండా తిరిగి నిష్క్రమించే ఒక క్షుద్రనటుడు. ఇంతకు మించి మరేమీ లేదు. జీవితమంటే శబ్దాడంబరంతో, క్రోధముద్రతో ఉన్మత్తుడొకడు చెప్పిన అర్థశూన్యమైన ఒక కథ. ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు. వార్తాహరి : కరుణాశీలీ! మహాప్రభూ! కళ్ళతో చూచినదాన్ని చెప్పటం నా ధర్మం. కనుక ఒక వార్త తెచ్చాను. కానీ దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మేక్బెత్: సరే, కానీయవయ్యా! వార్తాహరి : డన్స్నేన్ కొండమీద కాపలా తిరుగుతున్నప్పుడు నేను బిర్నాం మహారణ్యం వంకకు చూచాను. తక్షణమే ఆ మహారణ్యం కదలినట్లు నాకు తోచింది. మేక్బెత్ : నీచుడా! అసత్యవాదీ!! వార్తాహరి : చెప్పినట్లు జరగకపోతే మీరు ఏ శిక్ష చెప్పినా సహిస్తాను. ఔను ప్రభూ! అది జంగమమహారణ్యం. దుర్గం వరకు మూడు మైళ్ళూ అది నడిచి వచ్చింది. మేక్బెత్ : నీవు చెప్పింది అసత్యమైతే, ఆకలితో అలమటించి చచ్చేదాకా ఈ దగ్గర చెట్టుకే వ్రేలాడదీయిస్తాను. సత్యమైతే నీవు నన్ను అలా చేయించినా లెక్కించను. ఇప్పుడు నా విశ్వాసం సడలనారంభించింది. 'బిర్నాం మహారణ్యం డన్స్నేన్ వరకు కదలివచ్చేదాకా భయపడకు' అన్న ఆ మాంత్రికురాండ్ర ద్వంద్వార్థపు మాటలను ఇప్పుడు అనుమానించటం ఆరంభించాను. ఇప్పుడు ఒక అరణ్యం డన్స్నేన్ దాకా వస్తున్నది. శస్త్రాలను ధరించండి! శత్రువును ఎదుర్కోటానికి బయలుదేరండి. వీడు నిశ్చయం చేస్తున్నది కనిపించికపోతే ఇక్కడనుంచి పారిపోవటం గాని లేదా ఇక్కడనే ఉండిపోవట గాని రెండూ జరగవు. జీవితమంటే నాకు విసగట జనించింది. ప్రపంచంలో సుస్థాపితమైన క్రమాన్ని తారుమారు చేయతలపెట్టాను. జాగ్రద్దంటికను మొరయించండి. మహావాయూ! నీ ప్రబలశక్తిని ప్రదర్శించు. తారుమా రా! తరలి రా! కల్లోలమా! కదలి రా!! మరణించవలసివస్తే వీపున కవచంతోనే కదనభూమిలోనే నేను మరణింతునుగాక! (నిష్క్రమిస్తారు) 443